Home » ఇండ‌స్ట్రీలో ఉన్నా నేను మ‌హేశ్ బాబుకు పెద్ద అభిమానిని : విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ఇండ‌స్ట్రీలో ఉన్నా నేను మ‌హేశ్ బాబుకు పెద్ద అభిమానిని : విజ‌య్ దేవ‌ర‌కొండ‌

by AJAY
Ad

సినిమా హీరోల‌కు కూడా ఫేవ‌రెట్ హీరోలు ఉంటారు. తాము ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌కముందు కొంత‌మందిని అభిమానిస్తారు. మ‌రికొంద‌రు త‌మ‌కు న‌చ్చిన హీరోల‌ను ఇన్స్పిరేష‌న్ గా తీసుకుని ఇండ‌స్ట్రీలోకి వ‌స్తుంటారు. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఒక‌ప్ప‌టి నుండి టాలీవుడ్ స్టార్ హీరో మ‌హేశ్ బాబును అభిమానించేవార‌.

Advertisement

ఈ విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ లేటెస్ట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. తాను మొద‌ట‌గా థియేట‌ర్ లో మురారి సినిమా చూశాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపారు. ఇప్ప‌డు మ‌ల్టీ ప్లెక్స్ లు ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్ లు ఉన్నాయ‌ని కానీ అప్ప‌ట్లో టికెట్ కావాలంటే థియేట‌ర్ల ముందు లైన్ క‌ట్టాల్సిందేన‌ని చెప్పారు.

Advertisement

కొన్నిసార్లు మ‌హేశ్ బాబు సినిమాకు గంట‌ల త‌ర‌బ‌డి ఉన్నా టికెట్లు దొరికేవి కావ‌న్నారు. ఇండ‌స్ట్రీలో ఉన్నా కూడా తాను మ‌హేశ్ బాబుకు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. త‌న పెళ్లి చూపులు సినిమా విడుద‌లైన త‌ర‌వాత మ‌హేశ్ బాబు త‌న న‌ట‌న‌ను ప్ర‌శంసిస్తూ ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశార‌ని చెప్పారు.

ఆ రోజు ప్ర‌పంచాన్ని జ‌యించినంత ఆనందం క‌లిగిందంటే న‌మ్మండి అంటూ వ్యాఖ్యానించారు. మ‌హేశ్ బాబు త‌ర‌వాత త‌న‌కు రన్ బీర్ క‌పూర్ అంటే ఇష్ట‌మ‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపారు. ఇదిలా ఉండగా విజయ్ దేవ‌ర‌కొండ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా లైగ‌ర్ లో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

Visitors Are Also Reading