Home » ర‌ష్మిక‌తో పెళ్లి అంటూ వార్త‌లు..దారుణ‌మైన బూతుతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఫైర్..!

ర‌ష్మిక‌తో పెళ్లి అంటూ వార్త‌లు..దారుణ‌మైన బూతుతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ఫైర్..!

by AJAY
Ad

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న ప్రేమ‌లో ఉన్న‌రంటూ కొద్దిరోజులుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ లు గా మారిపోయిన వీరిద్ద‌రూ ముంబైకి మ‌కాం మార్చారు. అంతే కాకుండా వీరిద్దరూ ముంబైలో డేటింగ్ లో ఉన్న‌ట్టు గా కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణం వీరిద్ద‌రూ ఒక‌టి రెండు సార్లు ముంబైలో చ‌క్క‌ర్లు కొడుతూ కెమెరాల‌కు చిక్క‌డ‌మే ఇదిలా ఉండ‌గానే వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఓ బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు రాసింది.

ALSO READ : ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న హీరోలతో నటించిన ముద్దుగుమ్మలు వీరే…!

Advertisement

Rashmika

Rashmika

దాంతో ర‌ష్మిక విజ‌య్ దేవ‌ర‌కొండ పెళ్లి వార్త‌లు జోరందుకున్నాయి. వీరిద్ద‌రూ ఈ యేడాదే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్త‌లు చక్క‌ర్లు కొడుతున్నాయి. కాగా ఈ వార్త‌లపై తాజాగా రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఘాటుగా స్పందించారు. డ‌బుల్ మీనింగ్ బూతు ప‌దంతో ఆ వార్త‌ల‌కు చెక్ పెట్టారు. ఎప్ప‌టి లాగానే…మేము ఈ వార్త‌ల‌ను పేమించ‌డం లేదు అంటూ పేర్కొన్నారు.

Advertisement

ఇంగ్లీష్ లో విజ‌య్..వీ డోంట్ అని రాసి లవ్ ఎమోజీని జోడించి….ద న్యూస్ అంటూ పేర్కొన్నారు. సాధార‌ణంగా ఈ భాష‌ను మీమర్స్ ఉప‌యోగిస్తుంటారు. అదో బూతు ప‌దం కూడా…..ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ స్టేట్మెంట్ పై ఆయ‌న అభిమానులు స్పందిస్తున్నారు. రౌడీ హీరోతో పెట్టుకుంటే అంతే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండ‌గా…..విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌ష్మిక మంద‌న క‌లిసి గీతా గోవిందం అనే సినిమాలో న‌టించారు.

ఈ సినిమా స‌మ‌యంలోనే ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ్డారంటూ వార్త‌లు జోరందుకున్నాయి. అంతే కాకుండా ర‌ష్మిక మంద‌న కూడా త‌న ప్రియుడికి ఎంగేజ్మెంట్ త‌ర‌వాత బ్రేక‌ప్ చెప్ప‌డం కూడా ఈ వార్త‌ల‌కు కార‌ణం అయ్యింది. రీసెంట్ న్యూయ‌ర్ పార్టీ జ‌రుపుకోవ‌డం…రౌడీ హీరో ఫ్యామిలీతో ఫోటోలు దిగ‌టం ఇవ‌న్నీ పెళ్లి వార్త‌ల‌కు దారి తీశాయి. కానీ విజ‌య్ మాత్రం ఆ వార్త‌ల‌ను త‌న ఒక్క ట్వీట్ తో కొట్టిపారేశారు.

Visitors Are Also Reading