Home » ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర..!

ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర..!

by Anji
Ad

గాడ్ ఫాదర్ సూపర్ హిట్ తో మెగాస్టార్ చిరంజీవి మళ్లీ జోష్ లోకి వచ్చారనే చెప్పాలి. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తరువాత విడుదలైన గాడ్ ఫాదర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ ఆశించిన మేరకు కలెక్షన్లు రాలేదనే సమాచారం. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఈ చిత్రానికి కే.ఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా.. జనవరి 13, 2023న విడుదల చేయనున్నట్టు ఇటీవలే మూవీ మేకర్స్ ప్రకటించారు. 

Advertisement

ఈ సినిమా షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరకడంతో మెగాస్టార్ హాలీ డే ట్రిప్ కి వెళ్లినట్టు తెలుస్తోంది. తాజాగా ఫ్యామిలితో కలిసి విహార యాత్రకు సంబంధించిన పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. అదేవిధంగా షూటింగ్ కోసం శృతిహాసన్ తో కలిసి వెళ్తున్న ఫోటోను షేర్ చేశారు. ఫ్యామిలితో అటు విహార యాత్ర, హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర ఇంటూ క్యాప్షన్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాస్ పార్టీ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందనే చెప్పాలి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 

Manam News

Advertisement

మరోవైపు ఈసారి సంక్రాంతి పండుగకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనే ఉండనుంది. తొలుత తమిళ నటుడు అజిత్ నటించిన “తెగింపు” సినిమా జనవరి 11న విడుదల కాగా.. జనవరి 12న బాలయ్య నటించిన వీరసింహారెడ్డి, విజయ్ దళపతి నటించిన వారసుడు విడుదల కాబోతున్నాయి. జనవరి 13న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు వస్తుండడంతో సినీ అభిమానులు ఈ 4 సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అజిత్ సినిమాపై పెద్దగా ఎక్స్ ఫెక్టేషన్స్ మాత్రం లేవు. విజయ్ దళపతి నటించిన వారసుడు చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రాల మధ్య కలెక్షన్ల వార్ ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాలన్నింటిలో ఏ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందో వేచి చూడాలి మరి. 

Also Read :  సినిమా అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే ? 

Also Read :  సినిమా అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే ? 

Visitors Are Also Reading