Home » న‌య‌న్ ను కోడ‌లిగా ఒప్పుకునేందుకు విగ్నేష్ త‌ల్లి పెట్టిన ఒకే ఒక్క‌ కండిష‌న్ ఏంటో తెలుసా..?

న‌య‌న్ ను కోడ‌లిగా ఒప్పుకునేందుకు విగ్నేష్ త‌ల్లి పెట్టిన ఒకే ఒక్క‌ కండిష‌న్ ఏంటో తెలుసా..?

by AJAY
Ad

సౌత్ ఇండ‌స్ట్రీలో లేడీ సూప‌ర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ న‌య‌న‌తార‌. తెలుగుతో పాటూ త‌మిళ మ‌ళ‌యాల భాష‌ల్లో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌య‌న‌తార సినిమాలు చేస్తోంది. కాస్త ఏజ్ పెర‌గ‌టంతో ప్ర‌స్తుతం ఎక్కువ‌గా సీనియ‌ర్ హీరోల‌తో జోడి క‌డుతోంది. ఎంతో మంది హీరోయ‌న్ లు ఉన్నా ఈ అమ్మ‌డి క్రేజ్ వేరు. హీరోయిన్ ల‌లో ప్ర‌త్యేక జెట్ ఉన్న హీరోయిన్ ఒక్క న‌య‌నతార మాత్రమే. అంతే కాకుండా సీనియ‌ర్ హీరోల‌తో జోడీ క‌ట్టినా ఈ అమ్మ‌డి రెమ్యున‌రేష‌న్ కూడా ఎక్కువే ఉంటుంది. సినిమాల ప‌రంగా సూప‌ర్ సక్సెస్ కానీ న‌య‌న‌తార‌కు ల‌వ్ లైఫ్ విష‌యంలో మాత్రం గండం ఉన్న‌ట్టే క‌నిపిస్తుంది.

Advertisement

మొద‌ట న‌య‌న‌తార శింబు ప్రేమ‌లో ఉన్నారంటూ త‌మిళ మీడియాలో జోరుగా వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అంతే కాకుండా విరిద్ద‌రూ క‌లిసి దిగిన క్లోజ్ ఫోటోలు సైతం వైర‌ల్ అయ్యాయి. ఏమైందో ఏమో కానీ ఈ జంట విడిపోయింది. ఆ త‌ర‌వాత న‌య‌నతార ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ మ‌రియు ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవ‌తో ప్రేమాయణం న‌డిపించింది. అప్ప‌టికే ప్ర‌భుదేవ‌కు పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు.

Advertisement

Nayanatara Vignesh shivan

Nayanatara Vignesh shivan

కానీ న‌య‌న‌తార‌ను వివాహం చేసుకునేందుకు ప్ర‌భుదేవ త‌న భార్య‌కు విడాకులు ఇచ్చాడు. పెళ్లి త‌ర‌వాత సినిమాల‌కు కూడా న‌య‌న‌తార గుడ్ బై చెప్పాల‌నుకుంది. శ్రీరామ‌రాజ్యం త‌న చివ‌రిసినిమా అని షూటింగ్ చివ‌రిరోజున క‌న్నీళ్లు సైతం పెట్టుకుంది. కానీ వీరి పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యింది. ఇక ప్ర‌స్తుతం న‌య‌న‌తార త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. చాలా కాలం నుండి వీరి ప్రేమాయ‌ణం న‌డుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి పీట‌లు ఎక్క‌డ‌బోతున్న‌ట్టు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే న‌య‌న‌తార‌కు కాబోయే అత్త‌గారు విగ్నేష్ శివ‌ణ్ త‌ల్లి మీనాకుమారి ఓ కండిష‌న్ పెట్టిన‌ట్టు త‌మిళ మీడియాలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పెళ్లి త‌ర‌వాత పూర్తిగా యాక్టింగ్ కు గుడ్ బై చెప్పాల‌నే కండిష‌న్ పెట్టిన‌ట్టు టాక్. ముఖాల‌కు రంగులు వేసుకోవ‌డం త‌మ ఇంటావంటా లేద‌ని కాబ‌ట్టి పెళ్లి త‌ర‌వాత న‌య‌న్ సినిమాల‌కు పూర్తిగా దూరంగా ఉండాల‌ని మీనాకుమారి చెప్పార‌ట‌. మ‌రి వ‌రుస ఆఫ‌ర్ అందుకుంటున్న న‌య‌న్ ఇలాంటి స‌మ‌యంలో ఇండ‌స్ట్రీకి దూర‌మైతే ఆ ఆఫ‌ర్ లు మిస్ చేసుకున్న‌ట్టే.

Visitors Are Also Reading