Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మోసం చేశాడంటూ వేణు షాకింగ్ కామెంట్స్‌..!

ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ మోసం చేశాడంటూ వేణు షాకింగ్ కామెంట్స్‌..!

by Anji
Ads

అప్ప‌ట్లో హీరోగా పేరు తెచ్చుకున్న వేణు తొట్టింపూడి గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. స్వ‌యంవ‌రం, చిరున‌వ్వుతో, హ‌నుమాన్ జంక్ష‌న్‌, క‌ళ్యాణ‌రాముడు, పెళ్లాం ఊరిళ్లితే, ఖుషిఖుషిగా, చెప్ప‌వే చిరుగాలి వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ప్ప‌టికీ చాలా రోజులు ఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఫామ్‌లోకి వ‌చ్చి ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో క‌నిపించ‌నున్నాడు. వేణు ర‌వితేజ సినిమాలో సీఐ ముర‌ళి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ట‌. ఈ సినిమా ప్ర‌మోష‌న్‌ల‌లో భాగంగా మీడియా ముందుకు వ‌స్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే వేణు తొట్టెంపూడి ఆలీతో స‌ర‌దాగా షోకి వ‌చ్చాడు. అయితే ఈ షోకి వెళ్లమ‌ని వేణు వాళ్ల అమ్మ ఎప్పుడు చెప్పేద‌ట‌. మ‌రో వైపు ఆలీకి ఈ షోకి వ‌డ్డె న‌వీన్‌, వేణు తొట్టెంపూడిల‌ను గెస్ట్‌లుగా ఆహ్వానించండి అని ప‌లువురు యూట్యూబ్‌లో కామెంట్లు చేస్తున్నార‌ట‌.

Advertisement


ఇక వేణు ఆయ‌న గురించి చాలా విష‌యాల‌ను వెల్ల‌డించాడు. తొలుత న‌న్ను వెండి తెర‌కు ప‌రిచయం చేయాల్సింది భార‌తీరాజా కానీ కొంచెం మిస్ అయింది. వేణు గురించి ఆలీ మాట్లాడుతూ మిమ్మ‌ల్ని తొలిసారి చూసిన‌ప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే విన‌యంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. నా ఫ‌స్ట్ సినిమా నుంచి ఆలీగారు న‌న్ను వేలు ప‌ట్టుకొని ఇక్క‌డివ‌ర‌కు తీసుకొచ్చారు. నేను వేసుకున్న డ్రెస్ కూడా ఆలీదే అంటూ అంద‌రికీ న‌వ్వు తెప్పించాడు. త‌న హైట్ ఆరు అడుగుల మూడంగుళాలు అని వేణు చెప్ప‌డంతో ఆలీ ఏమి చేసుకుంటావ‌ని పేర్కొన్నాడు. ఇక త‌న సినిమా చిరున‌వ్వు గురించి చెప్పాడు. ప్ర‌ధానంగా చిరున‌వ్వు ఇంట‌ర్వెల్ సీన్‌, క్లైమాక్స్ కోసం చాలా నెల‌లు కాలం పాటు వెయిట్ చేశామ‌ని చెప్పాడు.

Ad

Advertisement

క‌ళాశాల చ‌దువుకునే రోజుల్లో ఉన్న‌ప్పుడు చ‌దువుకుంటాన‌ని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లేవాడిని. చ‌దువుకోకుండా కాలేజ్‌కి బంక్ కొట్టి సినిమాల‌కు వెళ్లి ఎక్కువ‌గా ఎంజాయ్ చేసేవాడ‌నన‌ని వేణు నాటి రోజుల‌ను గుర్తు చేసుకున్నాడు. ఇక సినిమాల‌కు వెళ్లే విష‌యం మా నాన్న గారికి తెలిసి ఒక రోజు చిత‌క్కొట్టాడ‌ని, బెల్ట్ కూడా తెగింద‌ని.. అయినా కానీ సినిమాల‌కు వెళ్ల‌డం మాత్రం మాన‌లేద‌ని చెప్పుకొచ్చాడు. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం సినిమా క‌థ ఏమిట‌ని ఆలీ వేణును అడిగాడు. ఈ సినిమా నేను చేయ‌క‌పోయినా పూరిజ‌గ‌న్నాథ్ నా ద‌గ్గ‌రికీ వ‌చ్చి దేశ‌ముదురు సినిమా క‌థ చెప్పారు. అల్లుఅర్జున్ న‌టించిన దేశ‌ముదురు సినిమాలో హీరో మీరే, యాంక‌ర్ మీరే అన్ని క‌వ‌ర్ చేస్తార‌ని చెప్పార‌ట‌. కానీ చివ‌రికీ త‌న‌ను తీసుకోలేద‌ని వేణు తెలిపారు. వేణుకి, పూరిజ‌గ‌న్నాథ్‌కి మ‌ధ్య జ‌రిగిన ఆ ఘ‌ట‌న‌ను ఆలీతో చెబుతూ వేణు చాలా బాధ‌ప‌డ్డాడు.

Also Read : 

పుష్ప -2 సినిమాకి అల్లుఅర్జున్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

అత‌డిని క‌లిసింది నిజ‌మే కానీ…70ఏళ్ల వ్యాపార‌వేత్త‌తో రిలేష‌న్షిప్ పై గృహ‌ల‌క్ష్మి నటి క్లారిటీ..!

 

Visitors Are Also Reading