Home » తొట్టెంపూడి వేణు రీఎంట్రీ…ఆ స్టార్ సినిమాలో బంప‌రాఫ‌ర్..!

తొట్టెంపూడి వేణు రీఎంట్రీ…ఆ స్టార్ సినిమాలో బంప‌రాఫ‌ర్..!

by AJAY
Ad

కొంత‌మంది ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ త‌ర‌వాత అనేక కార‌ణాల వ‌ల్ల క‌నుమ‌రుగు అవుతారు. కానీ వారి అభిమానులు మాత్రం త‌మ అభిమాన న‌టులు మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వాల‌ని కోరుకుంటారు. అలా ఓ వెలుగు వెలిగి క‌నుమ‌రుగైన నటీన‌టుల‌లో తొట్టెం పూడి వేణు కూడా ఒక‌రు. వేణు సినిమాల‌కు దూరం అయిన నాటి నుండి ఆయ‌న అభిమానులు మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు.

venu thottempudi

venu thottempudi

ఇప్పుడు వారి కోరిక నెర‌వేర‌బోతున్న‌ట్టుగా టాలీవుడ్ లోవార్త‌లు వినిపిస్తున్నాయి. మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ ప్ర‌స్తుతం న‌క్కిన త్రినాధ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను కామెడీ ఎంట‌ర్టైనర్ గా ఎర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వేణు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్మెంట్ వ‌చ్చే వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.

Advertisement

Advertisement

venu thottempudi

venu thottempudi

ఇదిలా ఉండ‌గా వేణు పెళ్లాం ఊరెళితే…గోపి గోపిక గోదావ‌రి, చెప్పవే చిరుగాలి లాంటి సినిమాలతో టాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ సినిమాల‌లో వేణు న‌ట‌న కామెడీ టైమింగ్ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. దాంతో వేణు రీఎంట్రీ ఇవ్వాల‌ని ఆయ‌న అభిమానులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading