Home » 2023 లో ప్రభాస్ కు అస్సలు బాగాలేదు.. ఆ ఇబ్బందులు తప్పవు : వేణు స్వామి

2023 లో ప్రభాస్ కు అస్సలు బాగాలేదు.. ఆ ఇబ్బందులు తప్పవు : వేణు స్వామి

by Bunty
Ad

సెలబ్రిటీలు, రాజకీయాల జీవితాలకు సంబంధించి అందరికీ సంబంధించిన జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తుంటాడు వేణుస్వామి. సమంత, నాగచైతన్య విడిపోతారని చెప్పడం అది వాస్తవం అవడంతో మనోడు తెగ పాపులర్ అయ్యాడు. ఇక అప్పటినుంచి తన నోటికి వచ్చినవి ఏవో చెబుతూ వస్తున్నాడు. ఇక ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి గురించి షాకింగ్ కామెంట్లు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

Advertisement

నయనతారకి పెళ్లి అచ్చి రాదని, వివాహం తర్వాత ఆమె జీవితంలో కలతలు, విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అవి విడాకుల దాకా దారితీసే అవకాశం కూడా ఉందంటూ వేణు స్వామి కొద్ది రోజుల క్రితం చెప్పారు. ఇక తాజాగా, ఇతను ప్రభాస్ జాతకం చెప్పాడు. వేణుస్వామి 2023లో ప్రభాస్ జాతకం చాలా వరస్ట్ గా ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు. వేణు స్వామి మాట్లాడుతూ “ప్రభాస్ జీవితంలో చాలా అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. సినిమాల పరంగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు. ప్రభాస్ జాతకాలను నమ్మడు.

Advertisement

అందుకే అతను జాతకాలపై తీసిన సినిమా కూడా ఫ్లాప్ అయింది. ప్రభాస్ రాజుల కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆ కమ్యూనిటీ వారు అందరూ జాతకాలు నమ్ముతారు, గౌరవిస్తారు. కానీ ప్రభాస్ గౌరవించడు. ప్రభాస్ ది వృశ్చిక రాశి. ఆయన జాతకంలో శని, గురువు మారుతూ ఉన్నారు. కాబట్టి ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా, పెళ్లి విషయాలపరంగా, సినిమాలపరంగా అతను చాలా సమస్యలు ఎదుర్కొంటాడు. ప్రభాస్ అనే వాడు ఒక వ్యక్తి కాదు. అతన్ని నమ్ముకుని చాలా కుటుంబాలు బ్రతుకుతున్నాయి. కాబట్టి, ప్రభాస్ వీటిని నమ్మి, వాటికి దోష నివారణలు వంటివి చేయించుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు.

READ ALSO : Rishabh Pant : కారు యాక్సిడెంట్‌లో టీమిండియా క్రికెటర్ రిషబ్‌ పంత్‌కు గాయాలు

Visitors Are Also Reading