Home » prabhas: కొత్త ఏడాదిలో ప్రభాస్ జాతకం మరీ దారుణం అంటూ వేణు స్వామి కామెంట్స్..?

prabhas: కొత్త ఏడాదిలో ప్రభాస్ జాతకం మరీ దారుణం అంటూ వేణు స్వామి కామెంట్స్..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీ నటీనటుల జాతకాలు వారి జీవితంలో జరగబోయే విశేషాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆయన ఇప్పటికే ఎంతోమంది హీరోల జాతకాల గురించి చెప్పారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి. ఆయన మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలు సంభవిస్తాయని చెప్పింది నిజంగానే జరిగింది. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Advertisement

also read:ఎంతో బ్యాగ్రౌండ్ ఉండి ఇండస్ట్రీలో ఎదగలేక పోతున్న నటులు.. ఎవరంటే..?

ఈ తరుణంలోనే ప్రభాస్ జాతకం గురించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే కొత్త సంవత్సరంలో ప్రభాస్ జాతకం ఏమాత్రం బాగోలేదని ఆయన కామెంట్స్ చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కొత్త సంవత్సరంలో ప్రభాస్ ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయనది వృశ్చిక రాశి అని వేణు స్వామి తెలియజేశారు. ప్రస్తుతానికి శని గురు స్థానాలు మారుతున్నాయని అన్నారు.

Advertisement

దీనితో ఆయనకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని , ఆయన అర్థాష్టమి శని ఒకవైపు అష్టమ గురువు ఒకవైపు షష్టమ గురువు మరోవైపు ఉండటంతో ఆయన అనేక సమస్యలు ఎదుర్కోబోతున్నారని హెచ్చరించారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. రెండు సినిమాలు హిట్ కొట్టలేదు. దీంతో వేణు స్వామి చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మరి చూడాలి కొత్త సంవత్సరంలో వేణు స్వామి చెప్పిన మాటలు నిజమవుతాయా లేదా అనేది..?

also read:

Visitors Are Also Reading