Home » వచ్చే ఎన్నికల్లో కేసీఆర్..ముఖ్యమంత్రి కాలేడు..రాసిపెట్టుకోండి – వేణుస్వామి

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్..ముఖ్యమంత్రి కాలేడు..రాసిపెట్టుకోండి – వేణుస్వామి

by Bunty
Ad

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎప్పుడు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలలో తలదూరుస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నటీనటుల జాతకాలు వారి జీవితంలో జరగబోయే విశేషాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఆయన ఇప్పటికే ఎంతో మంది హీరోల జాతకాల గురించి చెప్పారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి.

Advertisement

ఆయన మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలు సంభవిస్తాయని చెప్పింది నిజంగానే జరిగింది. దీంతో ఆయన వ్యాఖ్యాలు వైరల్ గా మారాయి. వచ్చే కొత్త సంవత్సరంలో ప్రభాస్ జాతకం ఏమాత్రం బాగోలేదని ఆయన కామెంట్స్ చేశారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. కొత్త సంవత్సరంలో ప్రభాస్ ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. ప్రభాస్ జాతకం ప్రకారం ఆయనది వృశ్చిక రాశి అని వేణు స్వామి తెలియజేశారు. ప్రస్తుతానికి శని, గురు స్థానాలు మారుతున్నాయని అన్నారు.

Advertisement

అయితే, తాజాగా తెలంగాణ రాజకీయాలపై వేణుస్వామి స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించినా, కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు సీఎం కాలేడని బాంబ్‌ పేల్చాడు. కేసీఆర్‌ స్థానంలో… కచ్చితంగా ఈ సారి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు వేణుస్వామి. తాను చెప్పింది కచ్చితంగా జరుగుతుందన్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతే, కాంగ్రెస్‌ పార్టీ గెలిచే ఛాన్స్‌ ఉందన్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే, కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి లేదా రేవంత్‌ రెడ్డి ఇంకా ఎవరైనా సీఎం కావచ్చునని వెల్లబించారు వేణు స్వామి.

READ ALSO : మెగా డాటర్‌ శ్రీజకు ప్రపోజ్‌ చేసిన ప్రీతమ్‌ జుకల్కర్‌ ?

Visitors Are Also Reading