Home » మహిళలు సక్సెస్ అవ్వాలంటే ఏం పూజ చేయాలి..రష్మిక ఇంట్లో వేణు స్వామి చేసిన పూజ ఏంటి..?

మహిళలు సక్సెస్ అవ్వాలంటే ఏం పూజ చేయాలి..రష్మిక ఇంట్లో వేణు స్వామి చేసిన పూజ ఏంటి..?

by AJAY

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రష్మిక మందన. చలో సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక ప్రస్తుతం స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ అంటూ గ్యాప్ లేకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రీసెంట్ గా రష్మిక హీరోయిన్ గా వచ్చిన పుష్ప సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా ఇప్పటికే రష్మిక మరి కొందరు హీరోలతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాజాగా జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ ఇంటర్వ్యూ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Rashmika venu swami

Rashmika venu swami

రష్మిక ఇంట్లో పూజలు చేసింది తానేనని హీరోయిన్ల కోసం ప్రత్యేక పూజలు ఉంటాయని తెలిపారు. ఆ పూజలను తారా దేవి పూజలు అని పిలుస్తారని చెప్పాడు. రష్మిక ఇంట్లో వామన పూజ అనే పూజను చేశానని చెప్పారు. ఈ పూజ అమ్మవారికి చేస్తారని కేవలం తాను మాత్రమే ఈ పూజను చేయగలనని చెప్పారు. ఈ పూజలో అమ్మవారికి మద్యం, మాంసం తో నైవేద్యం పెడతామని తెలిపారు. శాస్త్ర ప్రామాణికంగా నైవేద్యం పెడుతూ తాను పూజ చేయించానని వేణు స్వామి చెప్పారు.

 

ఒక మహిళ టాప్ సెలబ్రిటీ అవ్వాలన్నా, సినిమా హీరోయిన్ అవ్వాలన్నా, ప్రముఖ యాంకర్ అవ్వాలన్నా, రాజకీయాల్లో రాణించాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా తారా దేవి పూజ జరిపించుకోవాలి అని వేణు స్వామి తెలిపారు. తను రష్మిక ఇంట్లో పూజ చేసినప్పుడే కెరీర్ పీక్స్ కు వెళుతుందని చెప్పానని వేణు స్వామి అన్నారు. పూజ చేసిన వారం రోజుల్లో రష్మిక 5 సినిమాలకు సైన్ చేసిందని వేణు స్వామి పేర్కొన్నారు. అయితే కెరీర్ పరంగా రష్మిక మందన జాతకం బాగుందని కానీ వ్యక్తిగతంగా మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వేణు స్వామి తెలిపారు.

Visitors Are Also Reading