Home » రష్మిక ను రోహిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పింది నేనే : వేణు స్వామి

రష్మిక ను రోహిత్ శెట్టితో పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పింది నేనే : వేణు స్వామి

by AJAY

వేణు స్వామి ఈ పేరు ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో వేణు స్వామి రాజకీయ నాయకులు, సినిమా తారల జాతకాలు చెప్పి గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకుల గురించి వేణు స్వామి ముందే జోస్యం చెప్పారు. అంతే కాకుండా తన వద్ద పూజలు చేయించుకుంటే సెలబ్రిటీలకు సినిమా అవకాశాలు వస్తాయని ప్రచారం చేసుకుంటున్నారు.

Rashmika venu swami

Rashmika venu swami

ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో వేణు స్వామి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్మిక రక్షిత్ శెట్టి నిశ్చితార్థం జరిగిన తర్వాత వారి జాతకాలు పరిశీలించానని అన్నారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మంచిది కాదని తెలిసిందని చెప్పారు. అందువల్లే రష్మికకు రక్షిత్ శెట్టి నుండి విడిపోతేనే బాగుంటుందని సలహా ఇచ్చినట్టు చెప్పారు.

దాంతో రష్మిక రక్షిత్ శెట్టితో తన వివాహాన్ని రద్దు చేసుకుందని అన్నారు. ఇక వాళ్ల పెళ్లి రద్దయిన తర్వాత హైదరాబాద్ లో రష్మిక ఇంట్లో పూజలు చేశానని వేణు స్వామి తెలిపారు. ఈ పూజల తర్వాత రష్మిక ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా నిలబడిందని చెప్పారు.

అంతేకాకుండా రష్మిక కెరీర్ 2024 వరకూ అద్భుతంగా ఉందని అన్నారు. ప్రస్తుతం రష్మిక సినిమా ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటూ దూసుకుపోతుందని చెప్పారు. ప్రస్తుతం వేణు స్వామి రష్మిక గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading