Home » వెంకటేష్ -సౌందర్య కాంబోలో వచ్చిన 6 సినిమాల్లో 5 హిట్..ఆ 1 ఫ్లాప్ అవడానికి కారణం అదేనా..!!

వెంకటేష్ -సౌందర్య కాంబోలో వచ్చిన 6 సినిమాల్లో 5 హిట్..ఆ 1 ఫ్లాప్ అవడానికి కారణం అదేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు సూపర్ సక్సెస్ అవుతాయి. అలాంటి జంటల్లో ఒకటే వెంకటేష్-సౌందర్య జంట. వీరిద్దరూ కలిసి ఆరు సినిమాలు చేస్తే అందులో ఐదు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మిగిలిన ఆ ఒక్క సినిమాకి కూడా మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా ఫ్లాప్ గా మిగిలింది.
1. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
1996 లో ఇ.వి.వి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన కామెడీ అండ్ సెంటిమెంట్ చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. 25 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమాకంటే ముందే సౌందర్య, వెంకటేష్ తో సూపర్ పోలీస్ చిత్రంలో నటించినప్పటికీ ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ నగ్మా.


2. పవిత్ర బంధం
ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో 1996లో వెంకటేష్, సౌందర్య కాంబినేషన్ లో రిలీజ్ అయిన రమరో సినిమా పవిత్ర బంధం. ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యాక ఆరు భాషల్లో రీమేక్ చేశారు. దీన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చెప్పుకోవచ్చు. ఈ సినిమాతో వెంకీ,సౌందర్య కాంబినేషన్ పై క్రేజ్ పెరిగింది.

Advertisement


3.పెళ్లి చేసుకుందాం
పవిత్ర బంధం సినిమా హిట్ తర్వాత ముత్యాల సుబ్బయ్య మళ్ళీ వీళ్ళిద్దరినే నటీనటులుగా ఎంచుకొని 1997లో పెళ్లి చేసుకుందాం సినిమా తీశాడు. ఈ సినిమాలో అత్యాచారానికి గురైన మహిళ ను హీరో తన భార్యగా చేసుకుంటాడు. ఈ కథలో అనేక ఎమోషన్స్ ని చూపించి హిట్ కొట్టాడు ఆ దర్శకుడు. ఈ సినిమా 10 కేంద్రాలలో 100 రోజులు ఆడి హిట్ గా నిలిచింది.

Advertisement


4.రాజా
తమిళ సినిమాను తెలుగులో రాజా అనే టైటిల్ తో రీమేక్ చేశారు. సౌందర్య,వెంకీ ల కాంబో లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఈ సినిమాలో వెంకటేష్, సౌందర్య పోటీపడి నటించారు. 71 కేంద్రాలలో 100 రోజులు ఆడి 15 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.


5.జయం మనదేరా
ఎం. శంకర్ డైరెక్షన్ లో 2000 సంవత్సరంలో వచ్చిన మూవీ జయం మనదేరా. లండన్ లో గైడ్ గా వెంకటేష్,టూరిస్ట్ గా వచ్చిన సౌందర్య వీరిద్దరి మధ్య ప్రేమను అద్భుతంగా చూపించాడు శంకర్. సౌందర్య, వెంకీ కాంబో లో వచ్చిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 34 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

6. దేవి పుత్రుడు
2001లో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ డ్రామా దేవిపుత్రుడు. ఈ సినిమాను దాదాపు 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు నిర్మాత.అప్పటి వరకు వచ్చిన వెంకటేష్ సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ సినిమా ఇది. కథ పరంగా బాగానే ఉన్నా కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. సక్సెస్ఫుల్ జోడిగా కొనసాగుతున్న వెంకటేష్,సౌందర్య ల జంటకు ఈ సినిమాతో పుల్ స్టాప్ పడింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.

ALSO READ:

Visitors Are Also Reading