Home » ఎఫ్3 కోసం 3 రేట్లు రెమ్యునరేషన్ పెంచిన వెంకీ..!

ఎఫ్3 కోసం 3 రేట్లు రెమ్యునరేషన్ పెంచిన వెంకీ..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ అంటే ఎవరో తెలియని సినీ అభిమాని ఉండడు. ఇండస్ట్రీలోకి నిర్మాత డి రామానాయుడు కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ ఇలా అన్ని జోనర్లలో సినిమాలు తీసిన ఆయన విక్టరీ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు కూడా వెంకటేష్ ఏ మాత్రం వెన్నకి తగ్గకుండా… యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూనే ఉన్నారు.

Advertisement

 

ఇక ప్రస్తుతం వెంకీ నుండి మనకు వస్తున్న సినిమా ఎఫ్3. మూడేళ్ళ కిందట విడుదలైన ఎఫ్2 సినిమా సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో పాటుగా తమన్నా, మెహరీన్ కూడా ఉన్నారు. అయితే కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తీసిన ఎఫ్2 సినిమా 120 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడంతో ఈ సినిమాకు బడ్జెట్ కూడా పెంచారు.

Advertisement

ఈ క్రమంలోనే మన వెంకీ మామ కూడా తన రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తుంది. ఎఫ్2 సినిమాకు 7 కోట్లు తీసుకున్న వెంకీ ఈ ఎఫ్3 సినిమాకు మూడు రేట్లు రెమ్యునరేషన్ పెంచి 21 కోట్లు తీసుకున్నాడు అని ప్రచారం జరుగుతుంది. అయితే వెంకటేష్ సినీ కెరియర్ లో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్. ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఆయన ఇంత తీసుకోలేదు. ఈ నెల 27న అభిమానుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు వెంకీ. చూడలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

ఇవి కూడా చదవండి :

పెళ్లి పీటలు ఎక్కబోతున్న దీపక్ చాహర్..!

క్రికెటర్ భార్య పైన గవాస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్…!

Visitors Are Also Reading