Home » వెంకటేష్ తర్వాతి సినిమా అతనితో పక్కా..!

వెంకటేష్ తర్వాతి సినిమా అతనితో పక్కా..!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు మల్టి స్టారర్ సినిమాలు బాగా వస్తున్నాయి. అయితే ఒక్కపుడు ఇలాంటి సినిమాలు తెలుగులో ఎక్కువ వచ్చినా.. ఆ తర్వాత చాలా రోజుల వరకు ఇలాంటి సినిమాలు పలు కారణాల వల్ల తెరకెక్కేలేదు. కానీ మళ్ళీ తెలుగులో ఈ విధమైన సినిమాలను ప్రారంభించి మాత్రమే వెంకటేష్ అనే చెప్పాలి. మొదట మహేష్ బాబుతో కలిసి సినిమా చేసిన వెంకటేష్ ఆ తర్వాత వరుణ్ తేజ్ తో కలిసి మరో సినిమా చేసాడు . ఆ సినిమా హిట్ కావడంతో ఈ మధ్యే మళ్ళీ దానికి సీక్వెల్ లో కూడా ఇద్దరు హీరోలు కలిసి నటించారు.

Advertisement

అయితే ఇలా మల్టి స్టారర్ సినిమాలు చేస్తూనే.. సోలోగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు వెంకటేష్. అయితే ఇప్పుడు వెంకటేష్ సల్మాన్ ఖాన్ తో ఓ సినిమాలో నటిస్తూ.. రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ అనేది చేస్తున్నాడు. కానీ ఇప్పుడు వెంకటేష్ సోలో సినిమా అనేది ఎవరితో చేస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అయితే ఎప్పటినుండో వెంకటేష్.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేయన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తరుణ్ భాస్కర్ నటుడిగా ఎక్కువ సినిమాలు చేస్తుండటంతో.. డైరెక్షన్ అనేది పక్కకు పెట్టాడు అని తెలుస్తుంది.

Advertisement

అందువల్ల మరి వెంకీ మామ తన సినిమా ఎవరితో తీస్తాడు అనే చర్చ జరుగుతున్న వేల అనూహ్యంగా మరో పేరు అనేది తెర మీదకు వచ్చింది. గత ఏడాది జాతిరత్నాలు అనే సినిమాతో సూపర్ అందుకున్న డైరెక్టర్ అనుదీప్ తో వెంకటేష్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు అని తెలుస్తుంది. ఇప్పటికే అనుదీప్ వెంకీకి కథ కూడా వినిపించాడు అని.. అది బాగా నచ్చడంతో వెంకీ ఈ సినిమాకు పచ్చ జెండా కూడా ఊపినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అనుదీప్ హీరో శివకార్తికేయన్ తో కలిసి ప్రిన్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత నేరుగా వెంకీతో అనుదీప్ సినిమా అనేది ప్రారంభిచనున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

విరాట్ కు ఎందుకు సపోర్ట్ చేసాడో చెప్పిన బాబర్..!

ఐపీఎల్ పొడిగింపుకు ఒప్పుకున్న ఐసీసీ..!

Visitors Are Also Reading