Home » శోభన్ బాబు, కృష్ణంరాజు లతో వెంకటేష్ మల్టీ స్టారర్ లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి…? అసలేం జరిగింది..?

శోభన్ బాబు, కృష్ణంరాజు లతో వెంకటేష్ మల్టీ స్టారర్ లు మధ్యలోనే ఎందుకు ఆగిపోయాయి…? అసలేం జరిగింది..?

by AJAY
Ad

టాలీవుడ్ లోని స్టార్ హీరోలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. దగ్గుబాటి రామానాయుడు వారసుల్లో వెంకటేష్ హీరోగా పరిచయమయ్యారు. అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసిన రామానాయుడు వెంకటేష్ హీరోను చేసిన తర్వాత ఎక్కువ సినిమాలు వెంకటేష్ తోనే నిర్మించారు. వెంకటేష్ కెరీర్ లో ఫ్లాప్ ల కంటే బ్లాక్ బస్టర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

వెంకటేష్ ఎక్కువగా ఫ్యామిలీ సినిమాలు చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవారు. ఇక స్టార్ హీరో అయినప్పటికీ వెంకటేష్ మల్టీస్టారర్ లు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు. అంతేకాకుండా కేవలం ఒకే రకమైన సినిమాలకు పరిమితం అవ్వకుండా విభిన్న చిత్రాలతో వెంకటేష్ ప్రేక్షకులను అలరిస్తుంటారు. వెంకటేష్ కెరీర్ లో వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలు చాలానే ఉన్నాయి.

Advertisement

వెంకటేష్ మహేష్ బాబు కాంబోలో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సూపర్ హిట్ అయింది. అంతకుముందే వెంకటేష్ సుమన్ తో కలిసి కొండపల్లి రాజా సినిమా చేశారు. హీరో అబ్బాస్ తో కలిసి రాజా సినిమాలో నటించారు. ఇది ఇలా ఉండగా వెంకటేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లోనే కృష్ణంరాజుతో కలిసి ఓ మల్టీ స్టారర్ ను ప్రారంభించారు. అంతేకాకుండా సోగ్గాడు శోభన్ బాబుతో కూడా ఓ మల్టీస్టారర్ ను ప్రారంభించారు. శోభన్ బాబుతో సినిమాకు బి గోపాల్ దర్శకత్వం వహించాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి బప్పి లహరిని సంగీత దర్శకుడిగా నియమించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా మధ్యలోనే అయిపోయింది.

venkatesh rana

venkatesh rana

అంతేకాకుండా కృష్ణంరాజు వెంకటేష్ ల కాంబినేషన్ లోనూ ఓ మల్టీ స్టారర్ ప్రారంభమైంది. రోజా భర్త సెల్వమణి ఈ సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. సినిమాలో విజయశాంతిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో మలయాళం లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా కథను బి గోపాల్ వెంకటేష్ కు వివరించారు. దాంతో సెల్వమణి సినిమా పక్కన పెట్టేసి వెంకటేష్ ఆ సినిమాలో నటించాడు. అలా వెంకటేష్ చేయాల్సిన రెండు మల్టీ స్టారర్ లు మధ్యలోనే ఆగిపోయాయి.

Also read : విడాకుల డిప్రెషన్ నుండి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్న స‌మంత‌..? ప్రూఫ్ అదేనా..?

Visitors Are Also Reading