Home » వెంకటేష్ అంటే ఆర్తి అగర్వాల్ కు అంత ప్రేమ.. ఆ ఒక్క పని కోసం దిగజారిపోయిందా..?

వెంకటేష్ అంటే ఆర్తి అగర్వాల్ కు అంత ప్రేమ.. ఆ ఒక్క పని కోసం దిగజారిపోయిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఆర్తి అగర్వాల్ అంటే తెలియని వారు ఉండరు. ఒకానొక సమయంలో దర్శక నిర్మాతలు ఈమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. అలాంటి ఆర్తి అగర్వాల్ ఇండస్ట్రీ వదిలి ఈ లోకాన్ని వదిలి చిన్న వయసులోనే వెళ్లిపోవడం బాధాకరం. ఆమె చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కానీ రోజు ఏదో ఒక రకంగా వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఆర్తి అగర్వాల్ మరియు హీరో వెంకటేష్ మధ్య కూడా మంచి బాండింగ్ ఉండేదట. ఒకానొక సమయంలో ఈ బాండింగ్ లిమిట్స్ కూడా దాటిందని తెలుస్తోంది. మరి దాని గురించి పూర్తిగా తెలుసుకుందామా..

Advertisement

2001లో తొలిసారిగా ‘నువ్వు నాకు నచ్చావ్’ అనే మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ భామ. ఈ చిత్రం మంచి హిట్ అవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అది తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఈమె చేసిన సినిమాల్లో వసంతం, నువ్వు లేక నేను లేను, అందాల రాముడు, స్నేహం, వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఈమె హీరోయిన్ గానే కాకుండా వ్యక్తిగత విషయాల్లో కూడా అప్పట్లో వైరల్ అయింది. తరుణ్ తో ఈమె ప్రేమ వ్యవహారం నడిపిందని అనేక వార్తలు వినిపించాయి. తరుణ్ తో విడిపోయిన తర్వాతే డిప్రెషన్ లోకి వెళ్లి ఆమె ఆత్మహత్య చేసుకుందని సమాచారం.

Advertisement

కట్ చేస్తే ఆర్తి అగర్వాల్ తరుణ్ నే కాకుండా వెంకటేష్ ని కూడా ప్రేమించిందట. ఈ విషయం వెంకటేష్ కు తెలిసి అటువంటి ఉద్దేశం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారట. వీరిద్దరూ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా సమయంలో వీరి మధ్య క్లోజ్ నెస్ పెరిగిందని, ఆ తర్వాత వసంతం సినిమాలో మరీ క్లోజ్ గా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో అందులో ఫస్ట్ నైట్ సీన్, లిప్ లాక్ సీన్ ఉందట. అయితే ఈ విషయం తెలిసి వెంకటేష్ నేను చేయనని చెప్పారట. దీంతో డైరెక్టర్ ఆ సీన్స్ తొలగించారట. కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం ఆ సీన్స్ ఉండాలని అవి నేను చేస్తానని, డైరెక్టర్ పై ఫోర్స్ తెచ్చిందట. అయినా వెంకటేష్ నో చెప్పడంతో ఆ సీన్స్ చేయలేదని ఒక సందర్భంలో డైరెక్టర్ చెప్పారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading