Home » మెగాస్టార్ వల్లే సినిమాల్లో ఉన్నా.. లేదంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..!

మెగాస్టార్ వల్లే సినిమాల్లో ఉన్నా.. లేదంటే హిమాలయాలకు వెళ్లిపోయేవాడిని.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి వల్లనే తాను ఇంకా సినిమాల్లో ఉన్నానని, లేదంటే ఎప్పుడో హిమాలయాలకు వెళ్లిపోయేవాడినని పేర్కొన్నారు విక్టరీ వెంకటేష్. 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సైంధవ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. పరిశ్రమలో తొమ్మిదేళ్ల గ్యాప్ తరువాత చిరంజీవి తిరిగి వచ్చి ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అప్పుడే నాకు అర్థం అయింది ఈ నటన ఆగకూడదు అని.. మేము ఎప్పటికీ దీనిని కొనసాగిస్తూనే ఉండాలని పేర్కొన్నారు.

Advertisement

ముఖ్యంగా తాను ఇన్ని సినిమాలు చేస్తానని అస్సలు అనుకోలేదు. నాన్న బలమైన కోరిక, అన్నయ్య ప్రోత్సాహంతోనే కథానాయకుడిని అయ్యానన్నారు వెంకటేష్.  వెంకీ 75 కలియుగ పాండవులు-సైంధవ్  పేరుతో హైదరాబాద్ లో వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ గురువు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన కళియుగ పాండువలుతో నా సినీ ప్రయాణం మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పుకొచ్చారు. జయాపజయాలను చూడకుండా నేను చేసిన విభిన్న చిత్రాలను గమనించి ప్రోత్సహించారు.

తొలుత విక్టరీ అనేవారు.. ఆ తరువాత రాజా అని పిలిచారు. కొన్నాళ్లు పెళ్లి కాని ప్రసాద్.. తరువాత పెద్దోడు, వెంకీ మామ ఇలా పిలుపు మారినా కానీ ప్రేమ మాత్రం తగ్గలేదన్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పని చేస్తున్నానని తెలిపారు. చాలా సార్లు కెరీర్ ని వదిలిపెట్టి వెళ్లిపోదామనుకునే వాడిని. అంతలోనే చిరంజీవి గారు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చేవారు.  నా తోటి హీరోలు నాగార్జు, బాలకృష్ణ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు.  అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలను కొనసాగించాను. నా 75వ చిత్రం సైంధవ్ గొప్ప సినిమా అవుతుంది. జనవరి 13న అందరినీ అలరిస్తుంది. కృషి పట్టుదల ఉంటే విజయాలు సాధ్యం అవుతాయి. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తానని చెప్పారు వెంకటేష్. 

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading