Telugu News » Blog » మెగాస్టార్ సినిమాలో మరో హీరో..!

మెగాస్టార్ సినిమాలో మరో హీరో..!

by Manohar Reddy Mano
Ads
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కాలంలో ఒంటరిగా సినిమాలు అనేవి చేయడం లేదు. ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఎవ్వరో ఒక్క హీరో ఉండేలా చూసుకుంటున్నాడు. ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన సైరా సినిమాలో చాలా మంది సత్ర్లు నటించారు. అలాగే ఆయన ఈ మధ్య చేసిన ఆచార్య సినిమాలో కూడా రామ్ చరణ్ ఉన్నాడు. అలాగే ప్రస్తుతం చేసిన సినిమాల్లో  సల్మాన్ ఖాన్ చిరు సినిమా అయిన గాడ్ ఫాదర్ లో కనిపించబోతున్నాడు.
ఇక ఇవే కాకుండా ఆయన కెరియర్ లో 154 వ సినిమాగా వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా రవితేజతో ఓ ముఖ్య పాత్ర వేయిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇదే సినిమాలో మారి స్టార్ హీరో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ఆచార్య ఇచ్చిన షోకో.. లేక మారె కారణమో కానీ.. ఒక్క హీరోను కాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోస్ ఉండేలా చూసుకుంటున్నాడు మెగాస్టార్.
అయితే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చివర్లో గెస్ట్ రోల్ గా విక్టరీ వెంకటేష్ నటించబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే బాబీ వెంకీ తో కలిసి వెంకీ మామ అనే సినిమా చేసిన విషయ తెలిసిందే. అలాగే మెగాస్టార్ పై ఆయనకు ఉన్న అభిమానంతో ఈ సినిమాలో వెంకీ కనిపిస్తున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో వెంకీ కొద్ది సేపే ఉన్న ఆయన పాత్ర అనేది చాలా ఫన్నీగా ఉంటుంది అని సమాచారం.