Home » గుడివాడలో కొడాలి నానిని ఢీ కొట్టేది ఎవరో తెలుసా? ఆయన ఏం చేస్తారంటే ?

గుడివాడలో కొడాలి నానిని ఢీ కొట్టేది ఎవరో తెలుసా? ఆయన ఏం చేస్తారంటే ?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటి నుంచే రాజకీయ వేడి మొదలైంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకి పైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు ప్రారంభమయ్యాయి. ఓవైపు అధికార వైసీపీ, మరోవైపు ప్రతిపక్ష టీడీపీ, అదేవిధంగా జనసేన మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ సీఎం జగన్ 175 కి 175 సీట్లు గెలవాలనే ధీమాలో ఉంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎలాగైనా తాము అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో అధికార వైసీపీకి  ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ పెట్టేందుకు ఓ అస్త్రం దొరికిందా ? అంటే అవుననే సమాధానాలు చెబుతున్నారు. అసలు గుడివాడలో కొడాలి నాని పై గెలిచే మొనగాడు ఎవరు ? ఆయన బలం ఏంది ? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

ఏపీ రాజకీయాల్లో కీలకంగా కనిపిస్తున్న నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాని, ఆ తరువాత వైసీపీలో చేరి అత్యంత హేయమైన మాటలు, చేతలతో టీడీపీకి ఒక రకంగా ఇబ్బందికరంగా మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని నెహ్రు కుమారుడు అవినాష్ టీడీపీ నుంచి పోటీకి దింపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో అందరూ ఈసడించుకునే విధంగా నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులపై కూడా వ్యక్తిగత దూషణలకు దిగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కొడాలి నానికి చెక్ పెట్టాలని  ప్రయత్నిస్తుంది టీడీపీ అధిష్టానం. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించింది.  

Also Read : రాజకీయాల వల్ల చాలా నష్టపోయా…దండం పెడుతూ బండ్ల గణేష్ ఎమోషనల్…!

Advertisement

 

అందులో గుడివాడ పట్ణణాకిి చెందిన అమెరికాలోని అట్లాంటా నగర ఎన్నారై, ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగండ్ల రాము పేరు తెరపైకి వచ్చింది. అతనికి అంగబలం, అర్ధబలంతో పాటు సౌమ్యునిగా, హడావుడి ప్రచారాలకు దూరంగా ఉండే భూరి విరాళ ప్రధాత రాము గుడివాడ రాజకీయాల్లోకి మెరుపులా దూసుకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఈయన పలుమార్లు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని కూడా కలిసినట్టు సమాచారం. చంద్రబాబు కూడా నియోజకవర్గంలో పని చేయమన్నట్టు టాక్ వినిపిస్తోంది. రాముడు కుటుంబ సభ్యులు ఇప్పటికే గడివాడలో చాపకింద నీరులా పనులు చక్కబెడుతున్నారు. వచ్చే క్రిస్మస్ పండుగ నుంచి గుడివాడ ప్రజలకు టీడీపీ కార్యకలాపాలు విస్తృతం చేయనున్నారట. మొత్తానికి క్రిస్మస్ పండుగ తరువాత నియోజకవర్గంలోనే పూర్తిస్థాయిలో మకాం వేసి యాక్షన్ ప్లాన్ వేసి అమలు చేయనున్నారు రాము.

Also Read :  బాలకృష్ణ, శ్రీదేవి కాంబోలో 2 మూవీస్ మిస్ అవ్వడానికి కారణం ఎన్టీఆర్ అని తెలుసా..?

ప్రధానంగా బడుగు, బలహీన వర్గాలలో రాము కుటుంబానికి మంచి పట్టు ఉండడం, డబ్బుకు వెనకాల్సిన పని లేకపోవడం, కుల, సమీకరణాలు, ఇప్పటికే తన ఫౌండేషన్ ద్వారా పలు సేవలు చేశారు రాము. అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం కల రామ్ కి అన్ని పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నారు. దీంతో కొడాలి నానికి సరైన మొగుడు వెనిగండ్ల రామునే అంటూ.. గుడివాడలో చర్చ మొదలైంది. ఇప్పటికే కొడాలి నానితో విసిగి వేసారుకున్న గుడివాడ ప్రజలు పక్కా క్లీన్ ఇమేజ్ రూపంలో రాము కనిపిస్తున్నారు. ఎక్కడా ఇప్పటివరకు ఒకమాట తూలడం గానీ, లేక ఒకరితో మాట అనిపించుకోవడం గానీ లేనుటువంటి వెనిగండ్ల రాము ముందకు రావడం పట్ల అందరూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు.  గుడివాడ నియోజకవర్గం ఎన్నికల్లో రసవత్తరంగానే కనిపిస్తుంది. ముందు ముందు ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మరి. 

 

Also Read :  రాశి స్టార్ హీరోయిన్ కావడానికి కారణం చిరు భార్య సురేఖ అని తెలుసా..!!

Visitors Are Also Reading