Home » ఇండస్ట్రీ హిట్ దిశగా “వీర సింహ రెడ్డి” ? దెబ్బకి పుష్ప రికార్డులు సైతం బద్దలయ్యాయి గా !

ఇండస్ట్రీ హిట్ దిశగా “వీర సింహ రెడ్డి” ? దెబ్బకి పుష్ప రికార్డులు సైతం బద్దలయ్యాయి గా !

by AJAY
Published: Last Updated on
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతికి విడుదల అయింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. వీరసింహారెడ్డి సినిమాలో కథ పాతది అయినప్పటికీ సినిమాలో బాలయ్య ఫైట్ లు మరియు మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలోని యాక్షన్ సీన్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

Also Read:  తెలంగాణ శకుంతల జీవితంలో ఇన్ని కష్టాలను ఎదుర్కొందా..? 

Advertisement

ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా…. సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో హీరోయిన్ లుగా శృతిహాసన్ మరియు హనీ రోజ్ లు నటించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు.

Also Read:   “ఒక్కడు” సినిమా కోసం ఆ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు….ఆ సినిమా ఏదంటే ?

Advertisement

veerasimhareddy-review

అంతేకాకుండా డ్యూయల్ రోల్ లో నటించగా అందులో వీర సింహారెడ్డి పాత్ర ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసిన నాటి నుండి బాలయ్య లుక్ కు భారీ ఆదరణ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలోనూ బాలయ్య అదే లుక్ లో…. యాక్షన్ సీన్స్ లో రెచ్చిపోయారు. ఇక ఈ సినిమాకు కలెక్షన్ ల వర్షం కురుస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు గురువారం ఈ సినిమా 25.36 కోట్ల షేర్ ను వసూలు చేసింది. 50 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది.

బాలయ్య కెరియర్ లోనే ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడం మొదటిసారి. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు అత్యధిక షేర్ ను వసూలు చేసిన 15వ సినిమాగా ఈ సినిమా నిలిచింది. దాంతో అల్లు అర్జున్ రికార్డును బాలయ్య బీట్ చేశారు. ఇక పెళ్లిరోజు అత్యధిక షేర్ ను వసూలు చేసిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానంలో ఉంది.

Visitors Are Also Reading