Veera simha Reddy Release Date: నందమూరి నటసింహం బాలకృష్ణ గత ఏడాది డిసెంబర్ నెలలో అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అఖండ సినిమా తరువాత బాలయ్య వీరసింహారెడ్డి అనే పవర్ పుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైన్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Advertisement
Veera Simha Reddy: Release Date, Director Name, Heroine
Veera Simha Reddy Release Date
వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో మూవీలో కనిపించకుండా దునియా విజయ్ మూవీలో విలన్ గా కనిపించబోతున్నాడు. థమన్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటిని అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి లభిస్తుంది. ఇదిలా ఉండగా మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల కిందటే ప్రకటించింది.
Advertisement
Also Read : ముగ్గురిని మోసం చేసి మరో యువకుడితో పెళ్లి…చివరికి ఏం చేసిందో తెలుసా…?
Veera Simha Reddy Movie
ఈ మూవీ విడుదల తేదీని ఇన్ని రోజుల పాటు ఈ సినిమా యూనిట్ ప్రకటించలేదు. తాజాగా మూవీ యూనిట్ ఈ చిత్రం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. వీరసింహారెడ్డి సినిమాను జనవరి 12, 2023 తేదీన విడుదల చేయనున్నట్టు మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ లో బాలకృష్ణ పవర్ పుల్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియా అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతోంది.
Advertisement
Also Read : టాలీవుడ్ లో వ్యాపారవేత్తలను పెళ్లిచేసుకున్న 5 గురు స్టార్ హీరోయన్స్ వీళ్లే..!