Home » వీరసింహారెడ్డితో బాలయ్యకి మరో విజయం వరించేనా ?

వీరసింహారెడ్డితో బాలయ్యకి మరో విజయం వరించేనా ?

by Anji
Ad

Balakrishna Veerasimha Reddy Movie Story: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. అఖండ విజయం తరువాత బాలయ్య వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్మాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ రాజసం నీ ఇంటి పేరు.. ని మేకర్స్ విడుదల చేశారు. ఇక ఇందులో బాలయ్య తెల్ల దుస్తులతో ట్రాక్టర్ నడుపుతూ రాయల్ గా కనిపించారు. జైబాలయ్య నినాదంతో అఖండ సినిమాలో కూడా ఓ పాట వచ్చిన విషయం తెలిసిందే. 

Balakrishna Veerasimha Reddy Movie Story, Cast, Director Name, Music Director

Advertisement

వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా..  వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.  రిషి పంజాబీ సినిమాటోగ్రఫీగా, స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ ని అందించగా.. నవీన్ నూలి ఎడిటర్ గా, ఏ.ఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.  ఇప్పటికే ఈ చిత్రం నుంచి బయటికి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ విశేష స్పందన లభించింది. వీరసింహారెడ్డి టీజర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్ లు సినిమాపై ఓ హైప్ ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా “

Advertisement

Veerasimha Reddy Powerful Dialogues in Telugu

  • మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్..
  • భయం నా బయోడేటాలోనే లేదురా బోసిడికె.. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకళ్లారా”

అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ లు సినిమాకే హైలెట్ కానున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  కృష్ణ ఫారెన్ కార్ కొనాలనే కల నెరవేరడం కోసం ఏం చేశారో తెలుసా..?

మరోవైపు ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. తండ్రి కొడుకులుగా బాలయ్య కనిపించబోతున్నాడు. కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటూ హీరోయిన్ శృతిహాసన్ ప్రేమలో పడతాడట.. తండ్రి రాయలసీమ జిల్లాలో ఓ ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రజలకు అండదండగా మంచి పేరు సంపాదించుకుంటారట బాలయ్య. పలు ఊహించని కారణాలతో విలన్ చేతిలో తండ్రి మరణిస్తాడట. దీంతో తండ్రి మరణానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొడుకు విదేశాల నుంచి తిరిగి వస్తాడట. ఇక ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా కథ అని తెలుస్తోంది. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని కథనం కొత్తగా ఉంటుందని పలుమార్లు వెల్లడించాడు. ఇందులో 10కి పైగా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. ఈ చిత్రానికి యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. ‘అఖండ’ మాదిరిగా బాలయ్య వీరసింహారెడ్డి విజయం సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సంక్రాంతి పండుగ వరకు వేచి చూడాల్సిందే. 

Also Read :   యాదమ్మ రాజుకి కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading