Veera Simha Reddy Movie Dialogues: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల నటించిన “అఖండ” విజయం తరువాత బాలయ్య వరుస సినిమాలతో ఉన్నారు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్మాత్మకంగా తెరకెక్కిన చిత్రం “వీరసింహారెడ్డి”. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Also Read: Veera Simha Reddy Review in Telugu: “వీర సింహారెడ్డి” రివ్యూ..రికార్డులు బద్దలు కొడుతున్న బాలయ్య
Advertisement
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటించగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ, స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా వీరసింహారెడ్డి పవర్ ఫుల్ డైలాగ్స్ ని అందించారు. ఈ చిత్రం కోసం దాదాపు రూ.110 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలలో వీరసింహారెడ్డి మూవీ ఒకటి. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ లు సినిమాపై ఓ హైప్ ని క్రియేట్ చేశాయి.
వీరసింహారెడ్డి మూవీలో సెంటిమెంట్ బాగానే ఉంది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, బాలయ్య పాత్రలో వచ్చే కొన్ని స న్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంటాయి. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వస్తారు కాబట్టి సెంటిమెంట్ సన్నివేశాలు వారిని ఆకర్షించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. బాలయ్య తరువాత ఈ చిత్రంలో హైలెట్ రోల్ వరలక్ష్మీ శరత్ కుమార్ దే అని స్పష్టంగా అర్థమవుతోంది. బాలయ్య వీరసింహారెడ్డి పాత్రలో చెప్పిన డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య చెప్పిన డైలాగ్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : టాలీవుడ్ టాప్ 10 విలన్స్.. వారి రెమ్యునరేషన్.. తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!
Advertisement
Veera Simha Reddy Movie Best Dialogues
- భయం నా బయో డేటాలోనే లేదురా బ్లాడీ ఫూల్
- మీ GO గవర్మెంట్ ఆర్డర్ నా GO గాడ్ ఆర్డర్
- నా మాట పదును.. నా కత్తి పదును.. నీ పక్కోడికి తెలుసు.. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు నా కొడకళ్ళరా..
- సీమలో ఏ ఒక్కరూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తి పట్టాను. పరపతి కోసమో, పెత్తనం కోసమో కాదు.. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్ కాదు.. సీమ మీద ఎఫెక్షన్ ” వీరసింహారెడ్డి”.
- పుట్టింది పులిచర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు..
- 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరనైనా నిలబడి అడుగు.. అక్కడ నీకు ఓ స్లోగన్ వినిపిస్తుంది.. జైబాలయ్య..
- అపాయింట్ మెంట్ లేకుండా వస్తే.. అకేషన్స్ చూడను.. వెకేషన్స్ చూడను. ఒంటి చేతితో ఊచకోత.. కోస్తా నా కొడకా..
- సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరు.
- పదవీ చూసుకొని నీకు పొగరు ఏమో.. బై బర్త్ నా డీఎన్ఏకే పొగరు ఎక్కువా..!
- మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మీసం కాదురా బచ్చా.. నాకు సవాల్ విసరకు, నేను శవాలు విసురుతా..!
- నిన్ను తాకాలంటే కత్తి వణుకుద్దేమో.. నేను బరిలోకి దిగితే సీమే వణుకుద్ది.
- రాకరాక వచ్చిన మంత్రి పదవీ.. నా చేత అడ్డమైన ఫైల్స్ మీద సంతకాలు చేయిస్తుండారు..రేపు ఏదైనా తేడా వచ్చిందనుకో.. పక్కా రాష్ట్రంలో ఉన్నా ఎత్తుకొచ్చి మరి కొడుతారురా..
- ఆడితల తీసుకురమ్మంటే.. తలకాయ కూర తింటవా.. పగోడి సావు కన్నా అన్నం ఎక్కువా నీకు..?
- పగోడు పంపుతున్న పసుపు కుంకాలతో బతుకాతానంటే ముత్తైదవులా లేను ముండమోపిలా ఉన్నా..
- కాపు కాసిన కర్నూలోళ్లు, చుట్టుముట్టిన చిత్తూరోళ్లు, కమ్ముకొస్తున్న కడపోళ్లు, కత్తి కట్టిన అనంతపురమొళ్ళు ఎగెసికొస్తున్నారు.. సిద్దప్ప ఎండ నడినెత్తికెక్కేలోపు కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎర వేసి పోదాం.. రేయ్.. ఊరికి మంచి చేస్తే తలవంచుతా.. చెడు తలిస్తే ఎన్ని తలలైనా తెంచుతా..!
- వాడు దోచుకోవడానికి వచ్చాడు.. నాట్ అలోడ్.. పదవీ చూసుకొని నీకు పొగరేమో.. బై బర్త్ నా డీఎన్టీఏకి పొగరు ఎక్కువ.
- శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసయడమే నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా.
- మగతనం గురించి నువ్వు మాట్లాడు.. మొలతాల్లు సిగ్గు పడతాయ్..!
- మగతనం గురించి నువ్వు మాట్లాడు.. మొలతాల్లు సిగ్గు పడతాయ్..! ఈ గడ్డ మీద ఆడపడచు కోసం ప్రాణం ఇచ్చేవాడిని మగాడు అంటుంటారు. ఆడదానిని అడ్డుపెట్టుకొని బ్రతికే వాడిని కొ*జ్జా అంటారురా.. ముండమోపి..
- నా తండ్రి చితి సాక్షిగా చెబుతున్నా.. ఈ మట్టిమీద నా నెత్తురు బొట్టు పడే లోపు నీ తల తెగిపడకపోతే నేను సీమబిడ్డనే కాదురా..!
Also Read : అప్పుడు సైడ్ యాక్టర్స్.. ఇప్పుడు స్టార్ యాక్టర్స్..ఆ 10 మంది ఎవరంటే..?