Home » Veerasimha Reddy OTT: వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్  దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఏదంటే..? 

Veerasimha Reddy OTT: వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్  దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ ఏదంటే..? 

by Anji
Ad

Veerasimha Reddy OTT Date: గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం తాజాగా విడుదలైంది ఈ చిత్రం విడుదలతో థియేటర్ల వద్ద బాలయ్య అభిమానుల సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సంబురాలు ఈ సినిమాతోనే ప్రారంభం చేశారు అభిమానులు.ముఖ్యంగా యూఎస్ లో ప్రివయూ షోల ద్వారానే హాఫ్ మిలియన్ డాలర్లు క్రాస్ చేసింది వీరసింహారెడ్డి చిత్రం. బాలయ్య సినీ కెరీర్ లోనే అత్యధిక గ్రాసర్ గా రికార్డు నమోదు చేసింది ఈ చిత్రం. 

veerasimhareddy-review

Advertisement

ఇప్పటికే థియేటర్ల వద్ద విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకున్న వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ ని ఎవరు సొంతం చేసుకున్నారో ఓ అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీరసింహారెడ్డి డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసినట్టు సమాచారం. వాస్తవానికి సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్ లోనే ఈ విషయం ప్రచురించబడింది. ఈ చిత్రం విడుదలైన 45 రోజుల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతమందించారు. ఈ చిత్రంలోని పాటలు అన్నీ హిట్ అవ్వడంతో చార్ట్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది. ఈ సినిమాలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. 

Advertisement

Veerasimha Reddy OTT

Veerasimha Reddy OTT

తొలిరోజు వీరసింహారెడ్డి సినిమాకి పోటీగా ఏ సినిమా లేకపోవడంతో ఫస్ట్ డే నే బాలయ్య చిత్రం భారీగా కలెక్షన్లను వసూలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫ్యాక్షన్ డ్రాప్ సీన్లు ఓ రేంజ్ లో ఉన్నాయని.. థియేటర్లలో బాలకృష్ణ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి బాలయ్యను అందరూ హీరోల అభిమానులు ఇష్టపడుతుంటారు. బాలయ్య చెప్పే డైలాగ్ ల కోసం చాలా మంది సినిమా థియేటర్ల వద్దకు క్యూ కడుతుంటారు. మరోవైపు ఈ సినిమాలో చెల్లెలు సెంటిమెంట్ ఉండడంతో పండుగ సీజన్ లో ఫ్యామిలీస్ కూడా ఎక్కువగా చూసే అవకాశముంది. ఇన్ని పాజిటివ్ అంశాల మధ్య వీరసింహారెడ్డి కచ్చితంగా ఊహించని స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి. 

Visitors Are Also Reading