Home » ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వీణ‌-వాణి

ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన వీణ‌-వాణి

by Anji
Ad

అవిభ‌క్త క‌వ‌ల‌లు అయిన వీణ‌-వాణి గురించి దేశ వ్యాప్తంగా అంద‌రికీ తెలిసిందే. ఇవాళ విడుద‌లైన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల్లో వారు ప్ర‌తిభ క‌న‌బ‌రిచారు. వారికి ప్ర‌స్తుతం 19 ఏళ్లు. ఇంట‌ర్మీడియ‌ట్ సీఈసీ చ‌దివారు. వీణ 707, వాణి 712 మార్కులు సాధించారు. ఇద్ద‌రూ డిస్టింక్ష‌న్‌లో ఇంట‌ర్ పూర్తి చేశారు. వీణ, వాణి కోసం ఇంట‌ర్ బోర్డు ప్ర‌త్యేక ఏర్పాట్లు, ఎక్కువ స‌మ‌యం ఇస్తామ‌ని చెప్పిన‌ప్ప‌టికీ వాటిని కాద‌ని అందరి మాదిరిగానే వారు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు.


తాము ఇద్ద‌రం ఒక‌రికి ఒక‌రం కాంపిటీట‌ర్సే అని, చూసి రాయ‌డం, మాట్లాడుకుని రాసింది లేద‌ని తెలిపారు. వీణ‌, వాణి మొద‌టి, ద్వితీయ సంవత్స‌రం స‌బ్జెక్టు వారిగా మంచి మార్కులే తెచ్చుకున్నారు. ఇంగ్లీషులో వీణ 76, 85, తెలుగులో 74, 79, ఎక‌నామిక్స్‌లో 35, 73 మార్కులు కామ‌ర్స్‌లో 49, 81, సివిక్స్‌లో 62, 93 మార్కులు ద‌క్కించుకుంది. వాణి ఇంగ్లీషులో 70, 78 మార్కులు, తెలుగులో 76, 87, ఎక‌నామిక్స్‌లో 35, 76 మార్కులుకామ‌ర్స్‌లో 53, 87 మార్కులు, సివిక్స్‌లో 63, 87 మార్కులు వ‌చ్చాయి. 10వ త‌ర‌గ‌తిలో వీణ 9.3, వాణి 9.2 .జీపీఏ సాధించ‌డం విశేషం.

Advertisement

Advertisement


వీరిద్ద‌రు కూడా త‌మ‌కు చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ కావాల‌ని ఉంద‌ని వీణ‌, వాణి తెలిపారు. ఇందుకోసం ఫౌండేష‌న్ కోర్స‌లో జాయిన‌వ్వాలి సిద్ధ‌మైన‌ట్టు చెప్పింది. రాష్ట్ర, గిరిజ‌న‌, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరి భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన అన్ని స‌దుపాయాల‌ను క‌ల్పించి.. వారి క‌ల‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం త‌రుపున స‌హ‌కారం అందిస్తామ‌ని భ‌రోసా క‌ల్పించారు. వీరి విజ‌యం మ‌రొక‌రికి ఆద‌ర్శంగా నిల‌వాల‌ని, ఎంతో మందికి మాన‌సిక స్థైర్యాన్ని ఇవ్వాల‌ని మంత్రి కోరారు.

Also Read : 

డైరెక్ట‌ర్ ప‌ద‌వీకి ముఖేష్ అంబానీ రాజీనామా.. నూత‌న చైర్మ‌న్‌గా ఆకాశ్ అంబానీ..!

చిన్న పిల్ల‌ల‌కు త‌ల వెంట్రుక‌లు ఎందుకు తీస్తారో మీకు తెలుసా..?

Visitors Are Also Reading