తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. ఈ నటుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందినటువంటి ముకుంద మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాకపోతే వరుణ్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.
Advertisement
ఆ తరువాత పలు మూవీలలో హీరోగా నటించిన వరుణ్ ఇప్పటికే కంచే … ఫిదా … తొలిప్రేమ … గద్దల కొండ గణేష్ వంటి పలు విజయవంతమైన మూవీలలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ను తెచ్చుకున్న ఒక సినిమాను వరుణ్ తేజ్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.
Advertisement
అసలు విషయంలోకి వెళితే… మ్యాచో స్టార్ గోపీచంద్ తాజాగా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందినటువంటి రామబాణం సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. డింపుల్ హయాతి హీరోయిన్గా నటించిన ఈ మూవీకి మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. దర్శకుడు శ్రీ వాసు ఈ మూవీ కథను మొదటగా వరుణ్ కే వినిపించాడట. కాకపోతే కొన్ని అనివార్య కారణాలవల్ల వరుణ్ ఈ మూవీని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఆ తర్వాత గోపీచంద్ తో శ్రీ వాసు ఈ మూవీని రామబాణం పేరుతో రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల నుండి నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీకి పెద్దగా కలెక్షన్లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే కొంతమంది ఈ మూవీ కథను రిజెక్ట్ చేసి వరుణ్ మంచి పని చేశాడు అంటుంటే… మరి కొంతమంది మాత్రం ఈ మూవీ కథ గోపీచంద్ కి రొటీన్ అయినప్పటికీ… వరుణ్ కి ఈ కథ చాలా కొత్తగా ఉండేది అని ఈ మూవీ వరుణ్ మీద చాలా బాగా వర్కౌట్ అయ్యేది అని భావిస్తున్నారు.