Home » మరో సినిమాకు వరుణ్ పచ్చ జెండా..!

మరో సినిమాకు వరుణ్ పచ్చ జెండా..!

by Azhar
Ad
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఏడాది వరుణ్ తేజ్ ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. అందులో మొదటగా వచ్చిన గని డిజాస్టర్ గా మిగిలిపోయింది. కానీ ఈ సినిమాను మరిపించేలా వెంటనే వచ్చిన ఎఫ్ 3 సినిమ సూపర్ హిట్ గా నిలవడంతో గని ప్రాభవం పెద్దగా వరుణ్ తేజ్ పైన పడలేదు అనే చెప్పాలి.
అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్ లో ఓ సినిమా అనేది చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు అనేవి ఈ మధ్యనే జరిగి.. రెగ్యులర్ షూటింగ్ అనేది ప్రారంభం అయ్యింది. అయితే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బైనార్ పై బివిఎస్ఎన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటె.. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సమయం నుండే వరుణ్ తేజ్ కోట సినిమా కథలను వినడం ప్రారంభించినట్లు తెలుస్తుంది.
ఎందుకంటే ప్రస్తుతం తెలుగులోని హీరోలు అందరూ హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా.. మూడు, నాలుగు సినిమాలు లైన్ లో ఉంచారు. అందుకే వరుస కథలను వినడం ప్రారంభించిన వరుణ్ తేజ్ తాజాగా ఓ కథను పచ్చ జెండా అనేది ఊపినట్లు తెలుస్తుంది. ఈ సినిమా యొక్క అనౌన్స్ మెంట్ వచ్చే వారంలో ఉంటుంది అని తెలుస్తుండగా.. ఈ సినిమా కథ దేశ భక్తి మీద ఉంటుంది అని తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading