Home » వైష్ణవ్ డైరెక్టర్ కు ఓకే చెప్పిన వరుణ్..!

వైష్ణవ్ డైరెక్టర్ కు ఓకే చెప్పిన వరుణ్..!

by Azhar
Ad

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో వరుణ్ తేజ్ ఒక్కడు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా ప్రిన్స్ గా కొనసాగుతున్న వరుణ్ తేజ్.. ప్రస్తుతం సినిమాలు చేసే స్పీడ్ ను కొంచెం తాగించాడు అనే చెప్పాలి. కానీ మెగా హీరోల అందరి కంటే వరుణ్ మాత్రం కొంచెం కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ ఉంటాడు. అలా ఈ మధ్య గని అనే స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ సినిమా చేసాడు. కానీ బెడిసి కొట్టింది.

Advertisement

కానీ ఆ ప్లాప్ ను వెంటనే విడుదల అయిన ఎఫ్ 3 సినిమాతో కవర్ చేసుకున్నాడు. అలాగే ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. కానీ ఈ మధ్యే హీరోలు అందరూ మూడు మూడు సినిమాలకు ఓకే చెప్పి ఉంటె.. వరుణ్ మాత్రం మరో సినిమాకు గ్రీన్ సీగానల్ అనేది ఇన్ని రోజులు ఇవ్వలేదు.

Advertisement

కానీ తాజాగా వరుణ్ తేజ్ మరో మెగా హీరో అయిన వైష్ణవ్ తేజ్ దర్శకునికి ఓకే చెప్పినట్లు తెలిస్తుంది. వైష్ణవ్ తేజ్ తో ప్రస్తుతం రంగరంగ వైభవంగా అనే సినిమా తీసిన దర్శకుడు గిరీశయ్యకు వరుణ్ ఓకే చెప్పాడట. ఈ మధ్యే దర్శకుడు గిరీశయ్య వరుణ్ ఓ కథ చెప్పగా.. అది బాగా నచ్చి వెంటనే సినిమా చేయడానికి వరుణ్ తేజ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే గిరీశయ్యకు అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ తో మంచి గుర్తింపు అనేది వచ్చింది.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ స్థానానికి సూర్య కుమార్ ఎసరు..?

షాహీన్ ఆఫ్రిదీకి ఐపీఎల్ వేలంలో 15 కోట్లు..!

Visitors Are Also Reading