Home » ఇప్పుడు ప్ర‌భాస్ వంతు.. అక్టోబ‌ర్ 23న ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందే..!

ఇప్పుడు ప్ర‌భాస్ వంతు.. అక్టోబ‌ర్ 23న ద‌ద్ద‌రిల్లిపోవాల్సిందే..!

by Anji
Ad

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. బాహుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్ ఏ సినిమా చేసినా దేశవ్యాప్తంగా విడుద‌ల చేస్తూ సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డుతుంది. బాహుబ‌లి త‌రువాత వ‌చ్చిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేదు. ఇక త్వ‌ర‌లో ఆదిపురుష్ సినిమాతో ప్ర‌భాస్ రాబోతున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన టీజ‌ర్ సినిమాపై అంచ‌నాలు పెంచింది.

Advertisement

ఇదిలా ఉండ‌గా.. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భాస్ మ‌రో సినిమా హంగామా సిద్ధ‌మ‌వుతోంది. ఈ మ‌ధ్య స్టార్ సినిమాల‌న్నీ రీ రిలిజ్ చేసి రికార్డులు కొడుతున్నారు. మ‌హేష్ పోకిరి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా, బాల‌య్య న‌టించిన చెన్న‌కేశ‌వ‌రెడ్డి సినిమాలు రీ రిలీజ్ అయి రికార్డు సృష్టించాయి. ఇక ఇప్పుడు ప్ర‌భాస్ వంతు వ‌చ్చింది. ప్ర‌భాస్ సూప‌ర్ హిట్ సినిమాల్లో ఆల్ టైం ఫేవ‌రేట్ మూవీ వ‌ర్షం. ఈ చిత్రం 4 కె వ‌ర్ష‌న్ ని రీ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Also Read :  పొన్నియిన్ సెల్వ‌న్ లో న‌టించిన ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా ?


శోభ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్, త్రిష జంట‌గా న‌టించిన వ‌ర్షం సినిమా అప్ప‌ట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ప్ర‌భాస్‌కి స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఇదే అని చెప్ప‌వ‌చ్చు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎం.ఎస్.రాజు ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. మ‌రి రీ రిలీజ్ లో వ‌ర్షం చిత్రం ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ముఖ్యంగా ప్ర‌భాస్‌కి నేష‌న‌ల్ వైడ్ గా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌కి ఈ సినిమా రీ రిలిజ్ అయితే రికార్డు స్థాయిలోక‌లెక్ష‌న్స్ సాధిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అక్టోబ‌ర్ లో వ‌ర్షం, జ‌న‌వ‌రిలో ఆదిపురుష్ ఇలా ప్ర‌భాస్ ఫ్యాన్స్ హంగామాతో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోనున్నాయి.

Also Read :  రుద్రంగి ఫ‌స్ట్ లుక్.. భీమ్‌రావ్ దొర‌గా జ‌గ‌ప‌తి బాబు..!

Visitors Are Also Reading