Home » అందరికి షాక్ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్..!

అందరికి షాక్ ఇచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్..!

by Azhar
Ad

వరలక్ష్మి శరత్ కుమార్.. ఇప్పుడు ఈ పేరు అనేది సినిమా ప్రపంచంలో ఎక్కువగా వినిపిస్తుంది. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది వరలక్ష్మి. కానీ ఆమెకు హీరోయిన్ గా అంతగా అవకాశాలు రాకపోయినా.. సినిమాలో చాలా ముఖ్య పాత్రలో ఈమెకు ఆవేశాలు అనేవి వస్తున్నాయి. ఈ క్రమంలోనే లేడీ విలన్ గా ఇప్పుడు అవకాశాలు అనేవి అందుకుంటుంది. అయితే మొదట ఎక్కువగా.. తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన వరలక్ష్మి.. క్రాక్ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ అయ్యింది.

Advertisement

అలాగే ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించి మంచి మార్కులు అనేవి కొట్టేసింది వరలక్ష్మి. ఇక ప్రస్తుత సమయంలో మన తెలుగులో లేడీ విలన్స్ లేరు అనే చెప్పాలి. అటువంటి సమయంలో ఆ స్థానం భర్తీ చేయానికి వేసిన విధంగా వరలక్ష్మి అన్ని కూడా ఇప్పుడు ఆ తరహా పాత్రలే వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత చాలా తెలుగు సినిమాల్లో అవకాశం అందుకున్న వరలక్ష్మి.. ఇప్పుడు మరో సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే చేస్తుంది. అయితే ఈ సినిమాలో హీరో గా బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

దాంతో బాలయ్యకు వ్యతిరేకంగా తన విలనిజం అనేది వరలక్ష్మి ఎలా చూపిస్తుంది అనే విషయంలో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎంతో వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా బ్రేక్స్ అనేవి వేసింది. హీరో బాలయ్యకు కరోనా సోకడంతో షూటింగ్ అనేది వాయిదా పడింది. కానీ ఈ మధ్యే ఆయన కోలుకున్నారు అని సంతోషించేలోపే.. వరలక్ష్మి అందరికి షాక్ ఇచ్చింది. అయితే తాజాగా వరలక్ష్మి కూడా కరోనా బారిన పడింది. ఇక ఇప్పుడు ఈ బాలయ్య సినిమానే కాకుండా చాలా సినిమాల్లో నటిస్తున్న వరలక్ష్మి.. కరోనా బారిన పడటం అనేది అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి :

బుమ్రా స్థానంలో సిరాజ్ ఎందుకు తుది జట్టులోకి వచ్చాడో తెలుసా..?

ఐపీఎల్ పెంపుపై ఐసీసీ వద్ద పాక్ బోర్డు ఏడుపు..!

Visitors Are Also Reading