అత్తకు యముడు అమ్మాయికి మొగుడు మూవీలో వాణి శ్రీ అత్తగా.. చిరంజీవి అల్లుడిగా నటించారు. మరోసారి అత్త, అల్లుడిగా నటించే అవకాశం వస్తే.. ఆ సినిమాలో నటించేందుకు వాణి శ్రీ నిరాకరించారు. వాస్తవానికి అసలు ఏం జరిగిందంటే.. చిరంజీవి, వాణి శ్రీ కలిసి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి సూపర్ డూపర్ హిట్ మూవీలో నటించారు. అత్త.. అల్లుడు సక్సెస్ మేజిక్ ని రిపీట్ చేయాలని ఈవీవీ సత్యనారాయణ, నిర్మాత దేవీ వరప్రసాద్ భావించినా వాణి శ్రీకి ఆమె పాత్ర నచ్చకపోవడంతో నటించలేదు.
Advertisement
ఈ మూవీకి పోసాని కృష్ణ మురళి కథ, మాటలు అందించారు. చివరికీ ఈ మూవీలో వాణిశ్రీ అంచనా వాస్తవం అయింది. చిరంజీవి కూడా అలాంటి సినిమాలో నటించడంపై ఆయనను కూడా విమర్శించిన వారున్నారు. మనదేశంలో అత్తను.. అమ్మ తరువాత స్థానం అలాంటి పాత్రను టీజ్ చేయడం వరకు ఓకే గానీ.. అత్త పాత్రను వల్గర్ గా చూపించడంపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అప్పట్లో ఈ మూవీపై రెండుసార్లు సెన్సార్ చేశారు. చిరు సినిమాలో రెండుసార్లు సెన్సార్ చేసుకున్న మూవీగా రికార్డులకెక్కింది.
Advertisement
మరోవైపు సినిమాలో బ్రహ్మానందంతో ఆగవేషం వేయించడంతో పాటు ఆమెను కోట పాత్రతో అలా చేయించడంతో పాటు ఆసుపత్రి సీన్స్ కూడా ఈ మూవీపై విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా బాగానే ఉన్నప్పటికీ.. చెల్లెలకు, ఊరుకు జరిగిన అన్యాయాన్ని సహించని ఓ యువకుడు జైలు నుంచి తప్పించుకొని.. తన సమస్యలను ఎలా పరిష్కరించుకుంటాడనే కథాంశంతో తెరకెక్కిన సినిమానే అల్లుడా మజాకా.. ఇందులో చిరంజీవి చెల్లెలు పాత్రలో ఊహ నటించింది. 1995లో ఈ సినిమాని దేవీ వరప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. అప్పట్లో ఈ మూవీకి ఎన్టీఆర్ క్లాప్ కొట్టడం విశేషం.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
Samantha: పీకల్లోతు అప్పుల్లో సమంత? స్టార్ హీరో వద్ద 25 కోట్లు అప్పు చేసిందంటే !