చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ వాణి జయరాం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణి జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఇమె స్వస్థలం. హిందూస్తాని క్లాసికల్ సింగింగ్ లో ప్రావీణ్యం పొందిన వాణి జయరాం తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, గుజరాతి, మరాఠీ, ఒరియా, భోజ్పురి ఇలా 14 భాషల్లో దాదాపు పదివేలకు పైగా పాటలు ఆలపించారు.
READ ALSO : టీమిండియా క్రికెటర్ భార్యను మోసం చేసిన హైదరాబాదీలు !
Advertisement
అయితే ఈమె మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. సహజ మరణం కాదని, ఈమెపై కుట్ర జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో అసలు ఈమెది సహజమరణమా లేక తనపై ఎవరైనా కుట్ర చేశారా అన్న రీతిలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈమె మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Advertisement
ఈ క్రమంలోనే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ గాయం ఎలా అయ్యింది అనే విషయం గురించి ఇప్పుడే నిర్ధారణకు రాలేమని వైద్యులు వెల్లడించారు. తన పోస్టుమార్టం నివేదిక పూర్తిగా వచ్చిన తర్వాతనే ఈ గాయం గురించి వివరణ ఇస్తామని వైద్యులు వెల్లడించారు. ఇక పోస్టుమార్టం పూర్తి కావడంతో ఇవాళ మధ్యాహ్నం వాణి జయరామ్ అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ క్రమంలోనే ప్రముఖ గాయనిని చివరిసారి చూడటం కోసం పెద్ద ఎత్తున అభిమానులు, సినీ సెలబ్రిటీలు తరలివచ్చారు.
READ ALSO : ఇంత లావుగా ఉన్న అమ్మాయి… ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అని తెలుసా !