2014 సంవత్సరంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ… దేశవ్యాప్తంగా సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ఓటర్లు.. ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని 2014 సంవత్సరంలో బిజెపికి అవకాశం ఇచ్చారు. బ్లాక్ మనీ బయటకు తీసుకువస్తామని… ఎన్నికల మాయనిఫెస్టోలో పెట్టిన బిజెపిని నమ్మి.. జనాలందరూ మోడీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు.
Advertisement
అయితే 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ… మత రాజకీయాలు చేయడం మొదలు పెట్టింది. ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని తెరపైకి తీసుకువచ్చి… ఎన్నికల సమయంలో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పుల్వామా ఘటనను… తెరపైకి తీసుకువచ్చి రెండోసారి కూడా మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిందని ఆరోపణలు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలోనే… దేశవ్యాప్తంగా వందే భారత్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది మోడీ సర్కార్.
Advertisement
ఇందులో భాగంగానే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కూడా ఈ సేవలను ప్రారంభించింది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ మొదటగా.. నావి బ్లూ, వైట్ కాంబినేషన్ లో ఉండేది. అయితే తాజాగా ఈ ఎక్స్ప్రెస్ రైలు రంగులు పూర్తిగా మార్చేసింది మోడీ సర్కార్. కాషాయం రంగులో ఉండేటువంటి వందే భారత్… రైళ్లను తాజాగా తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే అచ్చం బిజెపి జెండా అలాగే ఈ రైళ్లు ఉన్నాయి. కాషాయం… రంగులో ఉన్న రైళ్లను తీసుకురావడం పట్ల ప్రతిపక్షాలు అలాగే కమ్యూనిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Sourav Ganguly : తిరుపతిలో రహస్యంగా పెళ్లిచేసుకున్న గంగూలీ – నగ్మా!
Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..