వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు..మన తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 15న అంటే ఆదివారం ప్రారంభం కానుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్యనడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాన మోదీ ఆదివారం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈనెల 15న ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం స్టేషన్లలో ఆగుతుంది.
Advertisement
Advertisement
ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందే భారత్ రైలు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు ప్రతిరోజు ఉదయం 5:45 గంటలకు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం రెండు 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు రాత్రి 11:30 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మొత్తం 14 ఏసీ చైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసి చైర్ కార్ కోచ్ లు ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల మధ్య నడవనున్న వందే భారత్ రైలు టికెట్ రేట్ల వివరాలు
సికింద్రాబాద్ టు వరంగల్ -520/-
సికింద్రాబాద్ టు ఖమ్మం – 750/-
సికింద్రాబాద్ టు విజయవాడ – 905/-
సికింద్రాబాద్ టు రాజమండ్రి – 1365/-
సికింద్రాబాద్ టు విశాఖపట్నం – 1665/-
READ ALSO : RamiReddy : ఈ స్టార్ విలన్ ఎలా చనిపోయారో తెలిస్తే..కన్నీళ్లు అస్సలు ఆగవు.!