టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు అంటి ముట్టనట్టు ఉన్నా కూడా ఆయనను మాత్రం రాజకీయాలు విడిచిపెట్టవు. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వార్తల్లో నిలుస్తుంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు వార్తల్లో ఆ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే వంశీ.. జూనియర్ ఎన్టీఆర్ కు సన్నిహితులు అన్న సంగతి చాలా మందికి తెలుసు.
Advertisement
కాగా తాజాగా వంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని తో బాగుండేవారని తాను కూడా ఆ సర్కిల్ కావడంతో వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయని చెప్పారు. ఒకప్పుడు తమ మధ్య మంచి సంబంధాలు ఉండేవని…. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల వల్ల అవి మారాయి అని చెప్పారు. ఎన్టీఆర్ అతని కెరీర్ ను అతను చూసుకుంటున్నాడని వెల్లడించారు. చంద్రబాబు చెప్పిన విషయాలు నిజం అయితే ఎన్టీఆర్ వారసులు ఇతర పార్టీల పై దృష్టి పెట్టారని ప్రశ్నించారు.
Advertisement
బాలకృష్ణ కూతురు పెళ్లి అయ్యేవరకు టిడిపితో అంటి ముట్టనట్టుగా ఉన్నారని అన్నారు. ఎన్టీఆర్ 2009 సంవత్సరంలో చిన్నపిల్లాడు అని అప్పటికే అతనికి ఊహించిన క్రేజ్ ఉండేదని చెప్పారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ కెరీర్ ను పణంగా పెట్టి మరీ టిడిపి కోసం ప్రచారం చేశారని చెప్పారు. తనకు సీటు ఇచ్చే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని చంద్రబాబు ఒట్టు పెట్టించుకున్నారని వెల్లడించాడు.
అంతేకాకుండా 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను పట్టించుకున్నారా …అంటూ వల్లభనేని వంశీ ప్రశ్నించారు .ఇప్పుడు ఎన్టీఆర్ స్పందించాలని కోరడం సరైనదేనా…? అని అన్నారు. చంద్రబాబు హ్యూమన్ ఎమోషన్స్ ను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్, రామారావు ప్రజల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఒరిగిందేమీలేదని అన్నారు.