Home » వాల్తేరు శ్రీ‌ను ఫ‌స్ట్ లుక్ ఎలా ఉందో తెలుసా..?

వాల్తేరు శ్రీ‌ను ఫ‌స్ట్ లుక్ ఎలా ఉందో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరో సుమంత్‌, ఐమా జంట‌గా న‌టిస్తూ.. మ‌ను య‌జ్ఞ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం వాల్తేరు శీను. రాజ్ క్రియేష‌న్స్ ప‌తాకంపై యెక్కంటి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తుది ద‌శ‌లో ఉన్న‌ది. బుధ‌వారం సుమంత్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేసారు చిత్ర బృందం.

Also Read :  గ‌ర్బంపై ట్రోల్స్…మూర్ఖులు అంటూ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఫైర్..!

Advertisement

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు మీడియాతో ముచ్చ‌టించారు. ముఖ్యంగా సుమంత్ కెరీర్‌లో ఒక భిన్న‌మైన చిత్ర‌మిది అని పేర్కొన్నారు. రొటిన్‌కు భిన్నంగా ఉంటుంది. వాల్తేరు శ్రీ‌నుగా విశాఖ‌ప‌ట్ట‌ణం రౌడీగా సుమంత్ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. హీరో పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేఇన లుక్‌కు సోష‌ల్ మీడియాలో మంచి స్పంద‌న వ‌స్తోంది.

Advertisement


నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి వ‌చ్చే నెల‌లో సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఈ చిత్రంలో మ‌ధు నంద‌న్‌, హైప‌ర్ ఆది, మిర్చి కిర‌ణ్‌, క‌ల్యాణ్‌, ధ‌న‌రాజ్‌, ర‌ఘు, కారు మంచి, సిజ్జు, ప్ర‌భ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మార్క్ కె. రాబిన్స్‌, పీఆర్ఓ వి.ఆర్‌. మ‌ధు బాధ్య‌త‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read :  ద్యావుడా..పుష్ప‌ను ఇలా వాడుకుంటున్నారేంట్రా…!

Visitors Are Also Reading