Home » Valimai Trailer : అజిత్ కోసం మ‌హేష్‌బాబు రంగంలోకి.. ట్విట్ట‌ర్‌లో వాలిమై ట్రైల‌ర్ విడుద‌ల

Valimai Trailer : అజిత్ కోసం మ‌హేష్‌బాబు రంగంలోకి.. ట్విట్ట‌ర్‌లో వాలిమై ట్రైల‌ర్ విడుద‌ల

by Anji
Ad

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌, బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి జంట‌గా న‌టిస్తున్న చిత్రం వాలిమై. హెచ్‌.వినోత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ బోని క‌పూర్ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 24న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ది.

Also Read :  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో తెలుగు హీరో టాప్ ప్లేస్ లో ఉన్నారు! ఏ రాష్ట్రంలో ఎవ‌రంటే?

Advertisement

ఇప్ప‌టికే త‌మిళంలో ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన మేక‌ర్స్‌.. తాజాగా తెలుగులో కూడా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ట్విట్ట‌ర్ ద్వారా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసి చిత్ర బృందానికి బెఎస్ట్ విషేష్ చెప్పారు. ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప‌వ‌ర్ పుల్ పోలీస్ ఆఫీస‌ర్ అర్జున్ అజిత్ క‌నిపిస్తుండ‌గా హ్యాక‌ర్ కింగ్ హీరో కార్తికేయ క‌నిపించాడు.

Advertisement

ట్రైల‌ర్ ని మొత్తం యాక్ష‌న్ స‌న్ని వేశాల‌తో నింపేశారు. ఇందులోని బైకు రేసింగ్ సీన్ల‌లో అజిత్ డూప్ లేకుండా న‌టించ‌డం విశేషం. ఇక ఎత్తుకు పై ఎత్తుల‌తో అజిత్ – కార్తికేయ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌కు థియేట‌ర్ల‌లో ర‌చ్చ మామూలుగా ఉండ‌దని తెలుస్తోంది. ఇక అజిత్‌, కార్తికేయ లుక్స్‌, న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఇక యువ‌న్ రాజా సంగీతం హైలెట్‌గా నిలిచింది. క‌రోనా కారణంగా వాయిదాల మీద వాయిదాల ప‌డిన సినిమా ఎట్ట‌కేల‌కు ఫిబ్ర‌వ‌రి 24 విడుద‌లకు రెడీ అయింది. ఏ సినిమాతో అజిత్ తెలుగులో కూడా హిట్‌ను అందుకుంటాడేమో చూడాలి.

Also Read :  Aadavallu Meeku Joharlu : “ ఆడ‌వాళ్లు మీకు జోహార్లు” టీజర్ ఎలా ఉందంటే..?

Visitors Are Also Reading