Home » చరిత్ర సృష్టిస్తున్న యంగ్ క్రికెటర్.. పదునాలుగేళ్లకే సచిన్ రికార్డును బ్రేక్ చేసాడుగా!

చరిత్ర సృష్టిస్తున్న యంగ్ క్రికెటర్.. పదునాలుగేళ్లకే సచిన్ రికార్డును బ్రేక్ చేసాడుగా!

by Srilakshmi Bharathi
Ad

రంజీలో పాల్గొనే అన్ని జట్లలో, బీహార్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దానికి కారణం ఆ జట్టు సభ్యుడు వైభవ్ సూర్యవంశీ. ఎందుకంటే వైభవ్ పదమూడు సంవత్సరాలు కూడా నిండకుండానే రంజీ ట్రోఫీలో అరంగ్రేటం చేసాడు. తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సులో రంజీలో తొలిసారిగా ప్రవేశించిన రికార్డును అధిగమించాడు. ఏ రంగంలో అయినా వయసు చాలా ముఖ్యమైనది. ఎంత త్వరగా కెరీర్ ప్రారంభిస్తామో.. అంత ఎక్కువ కాలం ఫీల్డ్ లో ఉండగలుగుతాము.

Advertisement

Advertisement

ఇది ముఖ్యంగా క్రికెట్ రంగంలో బాగా వర్తిస్తుంది. ఎంత చిన్న వయసులో ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వగలిగితే.. అంత ఎక్కువ కాలం ఫీల్డ్ లో కొనసాగగలుగుతాము. వైభవ్ సూర్యవంశీ రంజీలో అరంగేట్రం చేసిన నేటికి అతని అధికారిక వయస్సు 12 సంవత్సరాల 284 రోజులు. క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ రంజీలో అరంగేట్రం చేసినప్పుడు, అతని వయస్సు 15 సంవత్సరాల 232 రోజులు. తద్వారా రంజీల్లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వైభవ్ బీహార్‌లోని సమస్తిపూర్ నుండి వచ్చినందున, అతను బీహార్ రంజీ జట్టు సభ్యుడు. వైభవ్ ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. అతను ఆరు సంవత్సరాల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాడట.

ఏడు సంవత్సరాల వయస్సులో క్రికెట్ అకాడమీలో చేరాడు, అక్కడ అతను మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా వద్ద శిక్షణ పొందాడు. వైభవ్ గతంలో బీసీసీఐ గత ఏడాది నిర్వహించిన ఛాలెంజర్ ట్రోఫీ పోటీల్లో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు, అతను ఛాలెంజర్ ట్రోఫీ చివరి సీజన్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించడం ద్వారా మొత్తం క్రికెట్ రంగంలో సంచలనం సృష్టించాడు.

Visitors Are Also Reading