Home » ఏ హీరోకి కూడా సాధ్యం కాని రికార్డు సూపర్ స్టార్ పేరిట ఉన్న విషయం మీకు తెలుసా ?

ఏ హీరోకి కూడా సాధ్యం కాని రికార్డు సూపర్ స్టార్ పేరిట ఉన్న విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఎక్కువగా ట్రెండ్ ఫాలో అవుతారు. కానీ కొంత మంది మాత్రమే ట్రెండ్ సెట్ చేస్తారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ప్రపంచ సినీ చరిత్రలో అరుదైన రికార్డు సాధించడం సూపర్ స్టార్ కృష్ణకి మాత్రమే సాధ్యమైంది. భవిష్యత్ లో కూడా మరే హీరో కూడా చేయలేని సాధ్యం కానీ రికార్డులు ఎన్నో సాధించారు. సినిమాల్లో హీరో కృష్ణ చాలా మందికి ఆదర్శం ఇప్పటికీ కొన్ని పనులు ఆయనలా మరే హీరో కూడా చేయలేకపోయారంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన నటశేఖరుడు అయ్యాడు. 

Advertisement

సినీ ప్రేక్షకులకు తమ అభిమాన హీరో తెర మీద కనిపిస్తే ఇక పండుగే. అలాంటిది ఒక స్క్రీన్ మీద ఇద్దరు హీరోలు కనిపిస్తే.. డబుల్ బోనాంజా. ఒకే సినిమాలో మూడు పాత్రల్లో అలరిస్తే.. ఫ్యాన్స్ జాతర చేసుకుంటారు. ఆడియన్స్ కి ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది కానీ నటించే హీరో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు పడుతూ.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేశారు కృష్ణ. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది. మూడు పాత్రలో ముప్పై పాత్రలు యినా ఈజీగా చేయవచ్చు. కానీ అప్పట్లో మూడు పాత్రలు చేయాలి అంటే ఏ గ్రాపిక్స్ లేని రోజుల్లో  అంటే ఆర్టిస్ట్ లకు దడదడలాడిపతుంది. స్ట్రెయిన్ అవుతారు. రిస్క్ కూడా కానీ అదేది లెక్క చేయకుండా ఎక్కువ సినిమాల్లో త్రిబుల్ రోల్ చేసిన హీరోగా కృష్ణ రికార్డు సాధించాడు. 

Also Read :  SuperstarKrishna:సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు..!!

Advertisement

కుమార రాజా సినిమాలో తొలిసారిగా సూపర్ స్టార్ కృష్ణ మూడు పాత్రల్లో కనిపించారు. ఆ సినిమా కన్నడ సినిమా నుంచి రీమెక్ చేశారు. కన్నడలో అప్పటి స్టార్ హీరో రాజ్ కుమార్ నటించిన శంకర్ గురు సినిమా నుంచి రీమెక్ చేశారు. తెలుగులో కృష్ణ తండ్రి.. ఇద్దరూ కొడుకులుగా త్రిపాత్రాభినయం చేశారు. పి.సాంబశివరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించింది. కృష్ణ రెండో సారి డాక్టర్ సిని యాక్టర్ మూవీలో త్రిపాత్రాభినయం చేశారు. కృష్ణ, తనయుడు, మేనల్లుడుగా మూడు పాత్రల్లో కనిపించారు. మేనమామ పోలికలు ఉన్న మేనల్లుడు పాత్రలో కృష్ణ అద్భుతంగా నటించారు. ఇందులో ఒక హీరో డాక్టర్ గా నటిస్తే.. మరొకరు యాక్టర్ గా నటించారు. ఈ సినిమా కి విజయనిర్మల దర్శకత్వం వహించారు. 

Also Read :   కృష్ణ మృతి చెందడానికి అసలు కారణం ఏంటో తెలుసా ?

Super Star Krishna

మరో రెండు సినిమాల్లో కృష్ణ మూడు పాత్రల్లో కనిపించి అభిమానులను మురిపించాడు. సిరిపురం మొనగాడు సినిమాలో కృష్ణ నాలుగోసారి త్రిపాత్రాభినయం చేశారు. అంతేకాదు.. బంగారు కాపురం సినిమాలో తండ్రి ఇద్దరు కొడుకులుగా కృష్ణ త్రిపాత్రాభినయం చేశారు. సిరిపురం మొనగాడు చిత్రాన్ని కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వం వహించారు. కృష్ణ తండ్రీ కొడుకులుగా పోలీస్ ఆఫీసర్ గా విలన్ గా మూడు పాత్రల్లో నటించారు. బంగారు కాపురం సినిమాను పి.చంద్ర శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇంత వరకు ఏ హీరోకి సాధ్యం కానీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి హీరోలతో ఎవ్వరూ ఇలా మూడు పాత్రలు చేసే సాహసం చేయడం లేదు. ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంటున్నారు. 

Also Read :  రాజీవ్ గాంధీ’ ఢిల్లీ కి ‘కృష్ణ’ గారిని పిలిచించి ‘ఎన్టీఆర్’ గురించి ఏమని చెప్పారో తెలుసా ?

Visitors Are Also Reading