Home » ప్ర‌ధాని మోడీతో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వ‌ర్చువ‌ల్ భేటీ..ఎందుకంటే..?

ప్ర‌ధాని మోడీతో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ వ‌ర్చువ‌ల్ భేటీ..ఎందుకంటే..?

by Anji
Ad

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి సంబంధించి అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. రష్యా పై అనేక రకాల అంశాలు విధించిన అమెరికా ఇతర దేశాలకు కూడా అదే విధంగా సలహాలు ఇస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత ప్రధాని నరేంద్ర మోడీ వ‌ర్చ్‌వ‌ల్ సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశంలో బైడెన్ మాట్లాడారు. ప్రపంచ సంక్షోభాలు క‌రోనా మహమ్మారి ఆరోగ్య రంగంలో సవాళ్లపై కలిసి పని చేస్తున్నామని తెలిపారు. రక్షణ రంగంలో కూడా బలమైన భాగస్వాములుగా ఉన్నామని పేర్కొన్నారు.

Advertisement

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితి చాలా ఆందోళ‌న క‌రంగా ఉంది. మానవతా సహాయం అందించే చర్యలు చేపట్టాలని మోడీ పిలుపునిచ్చారు. వర్చువల్ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు సమాచారం. కరోనా మహమ్మారి వాతావరణ సంక్షోభం వంటి అంశాలపై ప్రధాని మోడీ, బైడన్ చర్చించారు. ప్రపంచంలో రెండు పురాతన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు గా సహజ భాగస్వాములని మోడీ పేర్కొన్నారు.

Advertisement

ఉక్రెయిన్‌ పరిస్థితులు చాలా కలవరపెడుతున్న తరుణంలో మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. బుచ్చా లో జరిగిన నరమేధాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఉచ్చాటన ఆందోళన కలిగిస్తుంది ప్రధాని తెలిపారు. రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చలు శాంతి మార్గానికి దారి తీస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. క్రైమ్ రష్యా అధ్యక్షులతో నేను మాట్లాడానని ప్రధాని వెల్లడించారు. ఉక్రెయిన్‌ అధ్యక్షులతో నేరుగా మాట్లాడాలని కు సూచించానని మోడీ పేర్కొన్నారు. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ భయంకరమైన దాడిలో బాధితులు ఎవరైనా ప్రజలకు భారతదేశం మానవత మద్దతును నేను స్వాగతిస్తున్నాను. బలమైన ప్రగతిశీల రక్షణ భాగస్వామ్యాన్ని పంచుకుంటామని స్పష్టం చేశారు.

Visitors Are Also Reading