పిల్లల వయస్సుని బట్టి ఎత్తు పెరగకపోతే శారీరక, మానసిక ఎదుగుదలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. న్యూట్రిషియన్స్ ఉన్నప్పటికీ డైట్ ఇస్తే ఎత్తు బాగా పెరుగుతుంది. బిడ్డ పుట్టిన 6 నెలల తరువాత ఆహారం ఇవ్వవచ్చు. ప్రారంభంలో ఘన ఆహారాన్ని ఇవ్వలేరు కాబట్టి ఈ సమయం తరువాత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. అయితే, 5 అంగుళాల ఎత్తు పెరిగేందుకు రూ. కోటిన్నర ఖర్చు చేశారు ఓ అమెరికన్. అమెరికాలోని మిన్నేసోటకు చెందిన మోసెస్ గిబ్సన్ అనే యువకుడు రియల్ స్టోరీ ఇది.
read also : IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ..వీడియో వైరల్
Advertisement
మోసెస్ గిబ్సన్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. కానీ తనని అందరు పొట్టివాడిగా చూస్తున్నారనే భావన మోసెస్ గిబ్సన్ ని చిన్ననాటి నుంచి దహించి వేసింది. స్కూల్ డేస్ లోనే తనని తోటి స్టూడెంట్స్ కామెంట్స్ చేస్తున్నారనే ఆవేదనతో రగిలిపోతూ పెరిగాడు. ఎత్తు పెరగడం కోసం చిన్నప్పటి నుంచి మెడిసిన్స్ వాడాడు. అయినా లాభం లేకపోయింది. అయినప్పటికీ ఎత్తు పెరగాలన్న కోరిక మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చివరకు భూత వైద్యులను కూడా సంప్రదించాడు. ఎవరైనా సరే జీవితంలో పైకి ఎదగాలని బలంగా కోరుకుంటారు. కానీ మోసెస్ గిబ్సన్ మాత్రం ఎలాగైనా సరే ఎత్తు పెరిగేందుకు జీవితంలో పైకి రావాలనుకున్నారు. అందుకోసం చాలా కష్టపడ్డాడు.
Advertisement
READ ALSO : IPL 2023 : ‘చెంప చెల్లుమంటుంది’.. గిల్ కు సెహ్వాగ్ వార్నింగ్
పగలు సాఫ్ట్వేర్ జాబ్ చేశారు. రాత్రి ఉబర్ డ్రైవర్ గా పనిచేశాడు. ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించుకున్నారు. తాను ఎత్తు పెరిగేందుకు ఇక సర్జరీలే దిక్కు అనుకున్నాడు. ఎంతో రిస్క్ తీసుకొని రెండు సర్జరీలు చేయించుకున్నాడు. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్న మోసెస్ గిబ్సన్ ఈ జూన్ నాటికి ఐదు అంగుళాల ఎత్తు పెరగాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఈ రెండు సర్జరీల కోసం మోసెస్ గిబ్సన్ 1,70,000 అమెరికన్ డాలర్లు ఖర్చు చేశాడు. భారతీయ కరెన్సీలో చెప్పాలంటే మోసెస్ గిబ్సన్ ఎత్తు పెరిగేందుకు చేయించుకున్న రెండు సర్జరీల కోసం ఏకంగా కోటి 35 లక్షలు వెచ్చించాడు.
read also : మొదటి సినిమాతోనే భారీ హిట్ కొట్టిన ఈ ఫేమస్ హీరోయిన్…ఎవరో తెలుసా ?