Home » రిషబ్ పంత్ కోసం బాలీవుడ్ బ్యూటీ పూజలు !

రిషబ్ పంత్ కోసం బాలీవుడ్ బ్యూటీ పూజలు !

by Bunty
Ad

టీమిండియా క్రికెటర్, వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ కు ఇవాళ ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వీధుల్లో, రిషబ్ పంత్ కారుకు ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు డివైడర్ ని ఢీ కొట్టి బోల్తా పడింది. కొద్దీ దూరం రాసుకుపోవడంతో కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్ తలకు, కాళ్లకు, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయి.

Advertisement

అయితే కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రిషబ్ పంత్. కారు రోడ్డు డివైడర్ ని ఢీ కొట్టిన ఆరు నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందే అటుగా వెళుతున్న వాహనాదారులతో పాటు స్థానికులు కారు ప్రమాదాన్ని గుర్తించారు. ఇది ఇలా ఉండగా,రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత నటి ఊర్వశి రౌతేల తాను ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసింది.

Advertisement

క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ఊర్వశి అన్ని వర్గాల ప్రజలతో కలిసి ప్రార్థనలు చేసింది. అయితే, ఆమె రిషబ్ గురించి లేదా అతని ప్రమాదం గురించి ప్రస్తావించలేదు. ఊర్వశి పోస్టుపై చాలామంది ‘రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి’ అని కామెంట్ చేశారు. 2018లో ఒక హోటల్ లాబీలో తనను కలవడానికి రిషబ్ పంత్ గంటల తరబడి వేచి ఉన్నాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నప్పటి నుంచి రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్ లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ వారు ఇద్దరి విడిపోయారు.

Visitors Are Also Reading