Telugu News » Blog » ఉపాసన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ! ఏమన్నారంటే ?

ఉపాసన ఇచ్చిన స్టేట్మెంట్ కి ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్న నెటిజన్స్ ! ఏమన్నారంటే ?

by AJAY
Published: Last Updated on
Ads

మెగా కోడ‌లు ఉపాస‌న అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. ఉపాస‌న మెగా కోడ‌లుగా కంటే అపోలో వైస్ చైర్మెన్ గానూ త‌న ఉనికిని చాటుకుంటూ ఉంటుంది. చాలా మందికి ఉపాస‌న సాయం చేస్తార‌ని ఆమె మ‌న‌సు చాలా మంచిది అని జ‌నాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఉపాస‌న్ సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. సినిమాల విష‌యానికి వ‌స్తే కేవ‌లం త‌న భ‌ర్త సినిమాల‌పైనే పోస్టులు పెడ‌తారు కానీ త‌న‌కు అనుభవం ఉన్న ఆరోగ్యానికి సంబంధించిన విష‌యాల‌ను ఉపాస‌న ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

Advertisement

ALSO READ : ఆరెంజ్ త‌ర‌వాత నిర్మాత‌లెవ‌రూ ద‌గ్గ‌ర‌కు రాలేదు..రామ్ చ‌ర‌ణ్ ఎమోష‌న‌ల్..!

 

ఓ పోర్టన్ ను కూడా ప్రారంభించి ఉపాస‌న హెల్త్ ఫిట్నెస్ కు సంబంధించిన అంశాల‌పై జ‌నాల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. ఏం తింటే మంచి ఎలా ఉంటే మంచిది ఇలా చాలా అంశాలపై వీడియోలు కూడా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఉపాస‌న ట్రోలింగ్ కు గుర‌వ్వాల్సి వ‌చ్చింది. గుడిపై సెల‌బ్రెటీలు ఉన్న‌ట్టుగా క‌నిపిస్తున్న పెయింటింగ్ ను షేర్ చేసి ట్రోల‌ర్స్ కు దొరికిపోయారు. ఈ పెయింటింగ్ పై చాలా విమ‌ర్శ‌లు వ‌చ్చినా కూడా ఉపాస‌న స్పందించ‌లేదు.

Advertisement

అయితే తాజాగా ఉపాస‌న గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో చేయిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. వీడియోలో ఉపాస‌న మాట్లాడుతూ….టాబ్లెట్ వేసుకునేవాళ్లు ఓ మంత్రం జ‌పిస్తే ఆ మెడిసిన్ మరింత మంచిగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు. మన పురాణాలు ఏమంటున్నాయంటే మందు తీసుకునేటప్పుడు మృత్యుంజ‌య మంత్రాన్ని జ‌పిస్తే అది బాగా ప‌నిచేస్తుంద‌ని చెప్పారు.

Advertisement

upasana meets modi

మెడిసిన్ అంటేనే నెగిటివ్ గా చూస్తామ‌ని కానీ రోగం ఉంటేనే మెడిసిన్ వేసుకుంటామ‌ని చెప్పారు. కాబ‌ట్టి మెడిసిన్ నెగిటివీటి పోవాలంటే మంత్రాన్ని జ‌పించాల‌ని అన్నారు. అయితే మంత్రాన్నే జ‌పించాల‌ని ఏమీ లేద‌ని… అల్లా అయినా క్రీస్తు అయినా తులుచుకుని వేసుకుంటే అది మ‌రింత బాగా ప‌నిచేస్తుంద‌న్నారు. ఇది తాను ఎక్క‌డో చ‌దివాన‌ని చెప్పారు.

You may also like