Home » సంతానం గురించి స‌ద్గురును అడిగిన ఉపాస‌న‌..ఆయ‌న ఏం స‌మాధానం చెప్పారంటే..?

సంతానం గురించి స‌ద్గురును అడిగిన ఉపాస‌న‌..ఆయ‌న ఏం స‌మాధానం చెప్పారంటే..?

by Anji
Ad

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు ఎంతో అన్యోన్యంగా ఉండే విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ దంప‌తులు త‌మ 10వ వివాహ వార్షికోత్స‌వాన్ని ఇట‌లీలో జ‌రుపుకున్నారు. అయితే వీరు అన్ని ర‌కాలుగా ఎంజాయ్ చేస్తున్న‌ప్ప‌టికీ వీరికి పిల్ల‌లు లేర‌ని ఒక వెలితి ఉంది. సంతానం లేర‌నేది వారి వ్య‌క్తిగ‌త విష‌యం అయినప్ప‌టికీ నెట్టింట్లో ఎప్పుడు దీని గురించి చ‌ర్చ సాగుతూనే ఉంది. ఉపాస‌న‌కు సైతం త‌ర‌చూ ఈ ప్ర‌శ్న ఎదురవుతున్న‌ప్ప‌టికీ ఏదో ఒక విధంగా దానిని దాట‌వేస్తూ వ‌చ్చింది. తాజాగా ఆధ్యాత్మిక గురువు స‌ద్గురు వ‌ద్ద పిల్ల‌ల క‌న‌డం గురించి ఉపాస‌న అడిగేసింద‌ట‌.

నేను పెళ్లి చేసుకుని 10 సంవ‌త్స‌రాలు అవుతుంది. నా వైవాహిక జీవితం చాలా సంతోషంగానే సాగుతుంది. నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఎంత‌గానో ప్రేమిస్తున్నాను. ప్ర‌జ‌లు మాత్రం నా లైఫ్‌లోని ఆర్ఆర్ఆర్ గురించే ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటున్నారు. మొద‌టి ఆర్ నా రిలేష‌న్ షిప్ గురించి.. సెకండ్ ఆర్‌. రీ ప్రొడ్యూస్ అన‌గా పిల్ల‌ల‌ను క‌నే సామ‌ర్యం. మూడ‌వ ఆర్ లైఫ్‌లో నా యొక్క రోల్ వీటి గురించి ఎక్కువ‌గా చ‌ర్చించుకుంటున్నార‌ని చెప్పుకొచ్చింది. ఈ ప్ర‌శ్న‌కు స‌ద్గురు ఆస‌క్తిక‌రంగా స‌మాధానం ఇచ్చారు.

Advertisement

Advertisement

రిలేష‌న్ అనేది నీ వ్య‌క్తి విష‌య‌మ‌ని.. అందులో ఎవ్వ‌రూ కూడా త‌ల‌దూర్చ‌కూడ‌దు. ఇక రెండ‌వ‌ది రీ ప్రొడ్యూస్ పిల్ల‌ల‌ను క‌నకుండా ఉండేవారంద‌రికీ నేను అవార్డులు ఇస్తాను. ఈ త‌రం వారు పిల్ల‌ల‌ను క‌నాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఇప్ప‌టికే ప్రపంచ జ‌నాభా మ‌రీ ఎక్కువ అవుతుంది. ఒక‌వేళ నువ్వు ఆడ‌పులివి అయి ఉంటే మాత్రం క‌చ్చితంగా పిల్ల‌ల్ని క‌న‌మ‌ని స‌ల‌హా ఇచ్చేవాడిని. ఎందుకంటే అవి అంత‌రించిపోతున్నాయి. మాన‌వులు అంత‌రించిపోవ‌డం లేదు. ఈ భూమి మీద ఎక్కువ సంఖ్య‌లోనే ఉన్నారు అని స‌ద్గురు బ‌దులిచ్చారు. ఆయ‌న స‌మాధానం విన్న ఉపాస‌న మీరు ఇలా చెప్పారు క‌దా.. మీకు మా అమ్మ‌, అత్త‌య్య గారి నుంచి ఫోన్లు వ‌స్తాయ‌ని స‌ర‌దాగా చ‌మ‌త్క‌రించింది. అలాంటి అమ్మ‌లు, అత్త‌ల నుంచి త‌న‌కు ఎన్నో ఫోన్లు వ‌స్తుంటాయ్ అని న‌వ్వారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : 

టాలీవుడ్‌లో మ‌రో విషాదం.. ప్ర‌ముఖ ఎడిట‌ర్ గౌత‌మ్ రాజు మృతి

ఆధార్ సంస్థ‌ కీల‌క నిర్ణ‌యం.. ఇక నుంచి వాటితో కూడా లింక్..!

Visitors Are Also Reading