Home » అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ పెళ్లి డేట్ ఫిక్స్..!

అన్ స్టాపబుల్-2 ప్రభాస్ ప్రోమో అదిరిపోయిందిగా.. డార్లింగ్ పెళ్లి డేట్ ఫిక్స్..!

by Bunty
Ad

 

నందమూరి నరసింహ బాలకృష్ణ ప్రస్తుతం ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ అనే టాప్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ షోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ తో కలిసి పాల్గొన్నారు. డిసెంబర్ 11న వీరికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరగగా, ఇటీవలే ప్రభాస్, గోపీచంద్ ఫొటోస్ రిలీజ్ చేసింది ఆహా.

ఇవి కూడా చదవండి : కమెడీయన్‌ ఆలీకి జగన్‌ బంపర్‌ ఆఫర్‌..అక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ !

Advertisement

అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్ తో బాలయ్య అల్లరి అదిరిపోయింది. తాజాగా విడుదలైన ప్రోమోలో, బాలయ్య రిక్వెస్ట్ తో డార్లింగ్ సార్ అని పిలిచారు ప్రభాస్. సల్మాన్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పుకొచ్చారు. నీ లైఫ్ లో మోస్ట్ రొమాంటిక్ సీన్ ఏంటి అని అడగ్గా, డార్లింగ్ రియాక్షన్ అదిరిపోయింది. ఆ తర్వాత డార్లింగ్ గురించి రాంచరణ్ కొన్ని సీక్రెట్ చెప్పేందుకు ట్రై చేస్తుండగా, ఒరేయ్ చరణ్, నువ్వు నా ఫ్రెండా, శత్రువు వా అంటూ సరదాగా అడిగారు.

Advertisement

చరణ్ లీక్ చేసిన న్యూస్, రాణి గురించే కదా అంటూ అసలు విషయం బయట పెట్టాడు గోపీచంద్. దీంతో గోపీచంద్ ను కొట్టేందుకు ప్రభాస్ ట్రై చేయగా, బాలయ్య అడ్డు నిలిచాడు. అలాగే మరోసారి బుజ్జిగాడు సినిమాలోని ఫేమస్ డైలాగ్ చెప్పి అలరించాడు డార్లింగ్. చివరగా తన పెద్దనాన్న కృష్ణంరాజును తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు ప్రభాస్. ఈ పూర్తి ఎపిసోడ్ డిసెంబర్ 30న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

 

Read ALSO : మ‌న టాలీవుడ్ తార‌లు.. ఎవ్వ‌రికి తెలియ‌ని బంధుత్వాలు ఇవే..!

Visitors Are Also Reading