Home » అన్ స్టాప‌బుల్ సీజ‌న్ -2 కు గెస్టులుగా చిరు, చంద్ర‌బాబు…..ఇంకా ఎవ‌రెవరు వ‌స్తున్నారంటే…!

అన్ స్టాప‌బుల్ సీజ‌న్ -2 కు గెస్టులుగా చిరు, చంద్ర‌బాబు…..ఇంకా ఎవ‌రెవరు వ‌స్తున్నారంటే…!

by AJAY
Ad

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ అనే టాక్ షోను చేస్తున్నారు. ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అందుకుంది. బాల‌య్య‌ టాక్ షోలో మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ సహా పలువురు ప్ర‌ముఖ దర్శకులు నటీనటులు సందడి చేశారు. మహేష్ బాబు ఎపిసోడ్ తో ఈ టాక్ షో కు ఎండ్ కార్డు పడింది. ఇక బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు సైతం బాలయ్య టాక్ షో పై ఆయ‌న హోస్టింగ్ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Balayya

Balayya

ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన టాక్ షోలు ఒక ఎత్తు బాల‌య్య టాక్ షో మ‌రో ఎత్తు అనే విధంగా మారిపోయింది. దానికి కారణం మిగతా టాక్ షోలు చేసేవారు స్క్రిప్ట్ ను ఫాలో అవుతుంటారు. దాన్ని బ‌ట్టే ప్ర‌శ్న‌లు వేస్తారు. కానీ బాలయ్య అలా కాకుండా తనకుతానే ప్రశ్నలు వేయడం…. వచ్చిన అతిథులతో స్టెప్పులు వేయడం పాటలు పాడించడం ఇలా ఎంతో వినోదాన్ని పంచుతున్నారు.

Advertisement

chiranjeevi

Advertisement

ఇక బాల‌య్య టాక్ షో కావ‌డంతో ఎంత పెద్ద స్టార్ అయినా వ‌చ్చేందుకు నో చెప్ప‌డం లేదు. దాంతో ఈ టాక్ షోను కొనసాగించాల‌ని చాలా మంది అభిమానులు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అన్ స్టాపబుల్ సీజన్- 2 కూడా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా సీజన్ -2 లో పలువురు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా వ‌చ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవి సీజ‌న్ 2 లో వస్తారని అన్ స్టాప‌బుల్ కు పని చేస్తున్న బీవీఎస్ రవి వెల్లడించారు.

samantha

samantha

అదేవిధంగా సీజన్ -2 లో అతిథులుగా సమంత, ఎన్టీఆర్, చంద్రబాబు కూడా వ‌స్తార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ లోనే ఎన్టీఆర్ వస్తారని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ రాకపోవడంతో బాలయ్య ఎన్టీఆర్ కు విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. కానీ సెకండ్ సీజ‌న్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ప‌క్కా అని స‌మాచారం. ఇదే జ‌రిగితే బాబాయ్ అబ్బాయ్ ముచ్చ‌ట్లు ఏవిధంగా ఉంటాయో చూడాలి.

also read : హీరోల కొడుకులు హీరోలు అయిన‌ట్టే, ఈ హీరోయిన్స్ కూతుళ్లు హీరోయిన్స్ అయ్యారు!

Visitors Are Also Reading