IPL 2024 : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మినీ వేలం ఎట్టకేలకు ముగిసింది. దుబాయ్ వేదికగా నిర్వహించిన బెట్టింగ్ లో మొత్తం 333 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. కానీ ఫ్రాంచైజీలో 72 మందిని మాత్రమే వేలంలో దక్కించుకున్నాయి. మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధర పలికాడు. కోల్కత్తా నైట్ రైడర్స్ 24.75 కోట్లు వెచ్చించి మిచెల్ స్టార్క్ ను కొనుగోలు చేసుకుంది. మరోవైపు ఆసీస్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ ను 20.50 కోట్లు వెచ్చించి సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. అయితే ఈ వేలంలో భారీ దళ ధర పలుకుతారు అనుకున్న కొంతమంది టాప్ ప్లేయర్లకు నిరాశ ఎదురయింది.
బేసిక్ ప్రైస్ ఉన్న కూడా వారిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేయలేదు. మినీ వేలంలో ఆస్ట్రేలియా టాప్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ను ఎవరు కొనుగోలు చేయలేదు. రెండవ రౌండ్ లోను అదే పరిస్థితి ఎదురైంది. గత ఐపీఎల్ సీజన్లో పూణే సూపర్ జేయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు స్మిత్ కెప్టెన్ గా ఉన్నాడు. స్మిత్ బేస్ ధర రెండు కోట్లు. అతను ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కొచ్చి టస్కర్స్ కేరళ, పూణే వారియర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. స్మిత్ 103 ఐపీఎల్ మ్యాచుల్లో 34.51 సగటుతో 2,485 పరుగులు చేశాడు.
Advertisement
అతని స్ట్రైక్ రేట్ 128.09. స్మిత్ తో పాటు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫిలిప్స్ సాల్ట్, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ జోష్ ఇంగ్లీష్, శ్రీలంకకు చెందిన కుషాల్ మెండీస్, దుష్మంత షమీరా, దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రైజ్ శమ్సీ, న్యూజిలాండ్ కు చెందిన ఇషాసోది, మైకేల్ బ్రెస్ వెల్, ఆడమ్ మిల్లె, మ్యాట్ హేన్డ్రీ, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వకర్ సలామ్, ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హేజిల్ వుడ్ ను కూడా ఎవరు కొనుగోలు చేయలేదు. వీరి బేస్ ధర రెండు కోట్లకు తక్కువే అయినప్పటికీ కొనేందుకు ఎవరు ఆసక్తిని చూపించలేదు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.