సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల కళా ప్రపంచం. ఈ ప్రపంచంలో రాణించాలి అంటే అంత ఈజీ కాదు. టాలెంట్ తో పాటు కాస్త లక్కు కూడా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నటనలో మార్పులు తెచ్చుకుంటూ ముందుకు సాగాలి. మొత్తానికి ఇండస్ట్రీ అంటే ఒక కత్తి మీద సాము లాంటిది అని చెప్పవచ్చు.
Advertisement
అలాంటి ఇండస్ట్రీలోకీ ఒకేసారి ఎంట్రీ ఇచ్చి , చాలా స్పీడ్ గా ఒక వెలుగు వెలిగి, తర్వాత కనుమరుగైపోయిన హీరోలు హీరోయిన్లు నటులు ఎంతోమంది ఉన్నారు.. వారి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ..
తరుణ్:
బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరుణ్. హీరోగా నువ్వే కావాలి సినిమా ద్వారా వచ్చారు. 2014లో వేట మూవీ చేసి, నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని , 2018లో ఇది నా లవ్ స్టోరీ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెరమరుగయ్యారు.
also read:రెడ్ వైన్ కదా అని చీప్ గా తీసేస్తున్నారా..తాగితే కరోనా ఖతం..!!
హీరో వేణు:
Advertisement
స్వయంవరం సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ ,పెళ్ళాం ఊరెళితే, చెప్పవే చిరుగాలి,ఖుషి ఖుషి గ వంటి హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా పేరు పొందాడు. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కనిపించాడు. మరలా ఏ సినిమాలో కనిపించడం లేదు.
వడ్డె నవీన్:
పెళ్లి,ప్రియా ఓ ప్రియా, లవ్ స్టోరీ, చాలా బాగుంది వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరుపొందాడు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.
ఆర్యన్ రాజేష్ :
హాయ్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఆర్యన్ రాజేష్ తర్వాత ఎవడి గోల వాడిది, వాడు అంతే అదో టైపు , నువ్వంటే నాకిష్టం , అనుమానాస్పదం వంటి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్లకే పరిమిత మయ్యాడు రాజేష్ .
also read: