Home » చిరంజీవి ఆ రోజు ఆ ఒక్క తప్పు చేసుంటే ఈ రోజు అల్లు ఫ్యామిలీకి ఆలుడుగా వెల్లవారు కాదట ! ఇంతకీ ఏమిటది ?

చిరంజీవి ఆ రోజు ఆ ఒక్క తప్పు చేసుంటే ఈ రోజు అల్లు ఫ్యామిలీకి ఆలుడుగా వెల్లవారు కాదట ! ఇంతకీ ఏమిటది ?

by AJAY
Ad

మ‌ధ్య‌ తరగతి కుటుంబం నుండి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అవడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ మెగాస్టార్ ఓ కానిస్టేబుల్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో అయ్యాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసి స్టార్ హీరో వరకు ఎదిగారు. పునాదిరాళ్లు సినిమాతో సినీ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకొని వలస ఆఫర్లను అందుకున్నాడు.

Advertisement

అంతేకాకుండా అప్పటి ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య ఇంటికి అల్లుడువయ్యే స్థాయికి ఎదిగాడు అంటే చిరు ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. అయితే అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడుగా సెలెక్ట్ చేసుకునే ముందు కొంత కథ నడిచింది. ప్రముఖ నటుడిగా ఉన్న అల్లు రామలింగయ్య చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారు. ఆ సమయంలో చిరంజీవిని అల్లు రామలింగయ్య దగ్గరగా గమనించారు.

Advertisement

chiranjeevi-and-surekha

chiranjeevi-and-surekha

ఈ నేపథ్యంలోనే చిరుని అల్లుడుగా చేసుకోవాలని ఆలోచన అల్లు రామలింగయ్య లో కలిగిందట. దాంతో తన కుమార్తె సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని తన కుమారుడు అల్లు అరవింద్ కు కూడా చెప్పారు. అయితే అప్పుడే తొందరపడవద్దని కొంత సమయం తీసుకుందామని అల్లు అరవింద్ తండ్రికి సూచించారట. ఆ తర్వాత చిరంజీవి గురించి కొంతమంది సన్నిహితుల వద్ద నటీనటుల వద్ద అరవింద్ ఎంక్వైరీ కూడా చేశారు.

ఇక వాళ్ళు చిరంజీవి గురించి చెప్పిన మాటలు విని అరవింద్ కు చిరంజీవిపై గౌరవం రెట్టింపు అయిందంట. అంతేకాకుండా చిరంజీవి అల్లురామలింగయ్యతో క‌లిసి ఒకసారి షూటింగ్ కోసం ట్రైన్ లో వెళుతున్న సందర్భంలో ఆసక్తికర సంఘటన జరిగింది. అల్లు రామలింగయ్య వైన్ తీసుకొని చిరంజీవి వద్దకు వెళ్లి తీసుకోమని చెప్పారట. కానీ చిరంజీవి మాత్రం తనకు వైన్ అలవాటు లేదని తాను తాగన‌ని తిరస్కరించారట. దాంతో అల్లు రామలింగయ్య కు చిరంజీవి తెగ నచ్చేసారట. ఒకవేళ చిరు ఆ వైన్ గ‌న‌క‌ తీసుకుని ఉంటే అల్లుడు కాకపోయి ఉండేవాడెమో అని అప్పట్లో ప్రచారం జరిగింది.

ALSO READ : “ఒకేఒక్కడు” సినిమా పై అప్పట్లో ‘చంద్రబాబు’ ఏమని కామెంట్ చేసారో తెలుసా ? అస్సలు ఊహించి ఉండరుగా..!

Visitors Are Also Reading