యాక్షన్ కింగ్ మోహన్ బాబు పై ఇప్పుడంటే ట్రోల్స్ వస్తున్నాయి. కానీ ఆయన హీరోగా ఎదగటానికి ఎంతో కష్టపడ్డారు. ఎలాంటి బాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. డైలాగ్ కింగ్…కలెక్షన్ కింగ్ అనే బిరుదులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా విద్యానికేతన్ అనే పేరుతో విద్యాసంస్థలు స్థాపించి విద్యను అందిస్తున్నారు. సినిమాల్లోకి రాకముందు మోహన్ బాబు డ్రిల్ మాస్టర్ గా పనిచేసేవారట.
Advertisement
Also Read: ట్విన్స్ బేబీస్ కి జన్మనిచ్చిన సింగర్ చిన్మయి.. మీరు కూడా ఓ లుక్కేయండి..!
కానీ సినిమాలపై ఉన్న ఆసక్తి తో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మోహన్ బాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కాలం కొనసాగారు. ఇక మోహన్ బాబు తండ్రి నారాయణ స్వామి నాయుడుకు మోహన్ బాబు పెద్ద కుమారుడు కాగా మరో కుమారుడు మరియు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక వారిలో మోహన్ బాబు పెద్దవాడు కావడం తో నారాయణస్వామి నాయుడు మోహన్ బాబుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.
Also Read: అప్పుడు నాకు సెన్స్ జ్ఞానం లేవు..నాగబాబు ఎమోషనల్..!
Advertisement
అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయం లో మోహన్ బాబు జీతం కేవలం రూ.250 మాత్రమే. ఇక ఆ సమయం లో సినిమా వాళ్లకు పిల్లను ఇవ్వమని చాలా మంది చెప్పడం వల్ల మోహన్ బాబుకు అసలు అమ్మాయి దొరకలేదట. దాంతో చేసేది లేక మోహన్ బాబు తండ్రి తన చిన్నకుమారుడికి మొదట వివాహం చేశారు. మోహన్ బాబు నేను నటుడుని అయ్యి జీవితం లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటా అని తన తండ్రికి చెప్పేశాడట.
కానీ ఆర్టిస్ట్ కాకముందే మోహన్ బాబు కు మంచి సంబంధం వచ్చిందట. అలా మోహన్ బాబు విద్యావతిని 1975లో మొదట వివాహం చేసుకున్నారు. వాళ్ళిద్దరికీ మొదట మంచు లక్ష్మి జన్మించగా రెండో సంతానం గా మనోజ్ జన్మించాడు. హ్యాపీ గా ఉన్న సమయంలో విద్యావతి ఆకస్మిక మరణం చెందారు. దాంతో మోహన్ బాబు కృంగిపోయారు. కానీ పిల్లల కోసం మోహన్ బాబు ను ఆయన అత్తా మామ ఒప్పించి తమ రెండో కూతురు నిర్మల ను ఇచ్చి వివాహం జరిపించారు. ఇక వీరిద్దరికీ మనోజ్ జన్మించాడు. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. మోహన్ బాబు తన విద్యాసంస్థలకు విద్యానికేతన్ అనే పేరును కూడా మొదటి భార్య పేరు ఆధారంగానే పెట్టారు.
Also Read: ప్లాప్స్ తర్వాత భారీగా రెమ్యునరేషన్ పెంచిన ప్రభాస్…!